ఖర్చు పెట్టాం… కానీ కనిపించలేదు : `మీకు మాత్రమే చెప్తా` నిర్మాత

0
2


టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా మీకు మాత్రమే చెప్తా. ఈ సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా, షామీర్‌ సుల్తాన్‌ను దర్శకుడిగా పరిచయం చేశాడు. విజయ్‌ నిర్మాతగా మారి రూపొందించటంతో పాటు ప్రచార కార్యక్రమాల్లో విజయ్‌ స్టేట్‌మెంట్స్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే రిలీజ్‌ తరువాత మాత్రం ఆ అంచనాలు తలకిందులయ్యాయి. సినిమాకు నెగెటివ్‌ టాక్‌ రాకపోయినా సూపర్‌ హిట్ అని మాత్రం అనలేదు. దీంతో చిత్రయూనిట్ ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా సినిమా క్వాలిటీ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా సినిమాను టీవీ సీరియల్‌లా, షార్ట్‌ ఫిలింలా చుట్టేశారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై విజయ్‌ దేవరకొండ తండ్రి వర్థన్‌ దేవరకొండ స్పందించారు.
Also Read: అఫీషియల్‌.. రీమేక్‌తో పవర్‌ స్టార్‌ Pawan Kalyan రీ ఎంట్రీ

`మీకు మాత్రమే చెప్తా సినిమా విషయంలో మేము ఖర్చు పెట్టలేదన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమాకు దాదాపు ఐదున్నర కోట్ల రూపాయల వరకు ఖర్చయ్యింది. దాదాపు కోటి రూపాయలు రెమ్యూనరేషన్లకే అయ్యింది. దాదాపు కోటి 25 లక్షల రూపాయిలు ప్రమోషన్ల కోసమే ఖర్చు చేశాం. సినిమా డీఐలో బ్రౌన్‌ టింట్‌ కారణంగా తెర మీద క్వాలిటీ కనిపించలేదు. తెర మీదకు వచ్చింది కొంతే అయినా ఇంకా చాలా షూట్‌ చేశాం. కానీ అదంతా నిడివి కారణంగా కట్‌ చేశాం.
Also Read: `విజయ్‌ దేవరకొండ డైరెక్ట్ చేస్తానంటే నేను ప్రొడ్యూస్‌ చేస్తా`

సినిమా కథ ఎప్పుడో ఫైనల్‌ అయ్యింది. ముందు విజయ్‌తోనే సినిమాను చేయాలనుకున్నాం కానీ అర్జున్‌ రెడ్డి సినిమా సక్సెస్‌ అయిన తరువాత ప్రాజెక్ట్‌ విషయంలో పునరాలోచించాం. తరువాత నవీన్‌ పొలిశెట్టితో చేద్దాం అనుకున్నాం. కానీ నవీన్‌ బిజీగా ఉండటంతో తరుణ్‌ భాస్కర్‌ హీరోగా చేద్దామని నేనే చెప్పా. అయితే దర్శకుడు కాస్త ఇబ్బంది పడినా తరువాత ఓకె చేశారు.

అయితే తరుణ్‌ భాస్కర్‌ వెయిట్ తగ్గడానికి, అభినవ్‌ గోమటం కాల్షీట్స్‌ కోసం ఆలస్యమైంది. అనసూయ హాలీడే టూర్‌కి వెళ్లడం కూడా సినిమా ఆలస్యానికి కారణం. ఎక్కువ భాగం రాత్రులు షూట్‌ చేయటం వల్ల కాల్షీట్స్‌ ఎక్కువయ్యాయి. ఎక్కువ భాగం ట్రావెల్‌లో షూట్‌ చేయటం వల్ల కూడా ఖర్చు పెరిగింది. ఇలా అనేక కారణాలతో సినిమా ఆలస్యమైంది. ఆరు నెలలో పూర్తి చేయాల్సిన సినిమా దాదాపు 18 నెలల సమయం పట్టింది. ఇలాంటి వాటి కారణంగానే బడ్జెట్‌ పెరిగింది`. అంటూ క్లారిటీ ఇచ్చారు.
Also Read: సూపర్‌ స్టార్‌కు అరుదైన గౌరవం.. `ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ` అవార్డ్‌Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here