ఖైదీ ఖతర్నాక్ ఐడియా.. కూతురిలా మారి, మాస్క్‌తో మాయచేసి పారిపోడానికి ప్రయత్నం

0
0


ఖైదీలు జైలు నుంచి పారిపోవడానికి ఎన్నో ప్లాన్లు వేస్తారనే సంగతి తెలిసిందే. వాటిలో కొన్ని సక్సెస్ అవుతాయి, మరికొన్ని విఫలమవుతాయి. అయితే, వారి ప్లాన్లు జైల్లో భద్రతా లోపాలను తేటతెల్లం చేస్తాయి. ఒక్కోసారి చాలా సిల్లీగా కూడా అనిపిస్తుంటాయి. బ్రెజిల్‌కు చెందిన ఆ గ్యాంగ్ స్టర్ జైలు నుంచి తప్పించుకోడానికి చేసిన ప్రయత్నం కూడా అలాంటిదే.

రియో జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్ క్లావినో డా సిల్వాను కలుసుకునేందుకు 19 ఏళ్ల కుమార్తె జైలుకు వెళ్లింది. అక్కడ ఖైదీలు బంధువులు కలుసుకునే గదిలో కుర్చొని తండ్రితో మాట్లాడింది. కొద్ది సేపటి తర్వాత తన కూతురు రూపంలో ఉన్న సిలికాన్ మాస్క్ ధరించాడు. కూతురిని ఆ గదిలోనే ఉంచేసి.. ఆమెకు బదులు అతడు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ముఖాన్ని కళ్లజోడుతో కవర్ చేసుకున్నా.. జైలు సిబ్బంది గుర్తుపట్టేశారు. తండ్రి పరారీకి సహకరించిందనే కారణంతో సిల్వా కుమార్తెను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడు మాస్క్‌ను తొలగిస్తున్న వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బ్రెజిల్‌లో డ్రగ్స్‌ను తరలించే కరుడుగట్టిన నేరగాళ్ల ముఠా ‘రెడ్ కమాండ్’ను నడిపిస్తున్న లీడర్లలో సిల్వా ఒకడు. ఈ ఘటన తర్వాత జైల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
వీడియో:

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here