గంగూలీ, అజహర్ అరుదైన ఘనత: ఆడిన అసోసియేషన్లకే అధ్యక్షులుగా!

0
4


హైదరాబాద్: వారిద్దరూ టీమిండియా మాజీ కెప్టెన్లు. భారత జట్టుకు అనేక గొప్ప విజయాలు అందించారు. ఒకరేమో తన టెక్నిక్‌తో టీమిండియా దశను మారిస్తే… మరొకరేమో భారత జట్టుకు దూకుడు నేర్పించారు. వారే మహ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ. తాజాగా వీరిద్దరూ తాము ప్రాతినిథ్యం వహించిన అసోసియేషన్లకు అధ్యక్షులయ్యారు.

రెండు రోజుల క్రితం క్రికెట్ ఆసోసియేషన్ ఆప్ బెంగాల్ (క్యాబ్)కు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సౌరవ్ గంగూలీ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక అవగా… శుక్రవారం హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో మహ్మద్ అజహరుద్దీన్ 74 ఓట్లతో విజయం సాధించి తొలిసారి హెచ్‌సీఏకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఫ్యాన్స్ మనసు గెలిచాడు: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అరుదైన సంఘటన

అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా మహ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలోని ప్యానెల్ ఆరు స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అక్టోబర్ 23న బీసీసీఐకి ఎన్నికలు నిర్వహిస్తుండటంతో లోథా కమిటీ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర స్థాయి అసోసియేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ

క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ

కోల్‌కతా అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) 85వ వార్షిక సర్వసభ్య సమావేశానికి రెండు రోజుల ముందు కోల్‌కతా వేదికగా జరిగిన ఎన్నికల్లో సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా గంగూలీకి ఇది రెండో టర్మ్. 2015లో జగ్మోహన్ దాల్మియా మరణించిన తరువాత గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

2020 వరకు మాత్రమే

2020 వరకు మాత్రమే

అధ్యక్ష పదవికి ముందు సౌరవ్ గంగూలీ క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా ఉన్నాడు. మూడేళ్ల కూలింగ్ పీరియడ్‌ ఉండటంతో సౌరవ్ గంగూలీ జూలై 2020 వరకు మాత్రమే క్యాబ్ అధ్యక్షుడిగా ఉండగలరు. జగ్మోహాన్ దాల్మియా కుమారుడు అవిషేక్ దాల్మియా సెక్రటరీగా తిరిగి రెండోసారి ఎన్నికయ్యాడు.

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహరుద్దీన్

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహరుద్దీన్

శుక్రవారం జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అజహర్‌ 74 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ, కౌన్సిలర్, ట్రెజరర్, సెక్రటరీ ఆరు స్థానాలను సొంతం చేసుకుంది.

ఆరు స్థానాలను ఒకే ప్యానెల్

ఆరు స్థానాలను ఒకే ప్యానెల్

ఆసోసియేషన్ చరిత్రలో అన్ని స్థానాలను ఒకే ప్యానెల్ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. శుక్రవారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో అసోసియేషన్‌ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 226 ఓట్లకు గాను 223 ఓట్లు పోల్‌ అయ్యాయి. అజహర్‌కు 147 ఓట్లు పడగా, ప్రకాశ్‌ జైన్‌ 73, దిలీప్‌ కుమార్‌ 3 ఓట్లు పడ్డాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here