గంజాయి మత్తులో ప్రేమికుల జంట..! నకిలీ పోలీసు అఘాయిత్యం..! చెన్నైలో వింత ఘటన..!!

0
0


గంజాయి మత్తులో ప్రేమికుల జంట..! నకిలీ పోలీసు అఘాయిత్యం..! చెన్నైలో వింత ఘటన..!!

తమిళనాడు/హైదరాబాద్ : ఇదో విచిత్ర కథ. వారు నకిలీ పోలీసులు. ఓ జంట విహారానికి ఓ ప్రదేశానికి వెళ్లింది. మామూలుగా వెళ్లారా అంటే లేదు, గంజాయి సేవించి విహార ప్రదేశానికి వెళ్లింది ఆ జంట. అంతే జగరకూడని పరిణామం వారి జీవితంలో చోటుచేసుకుంది. ఓ నకిలీ పోలీసు ప్రియుడిని బెదిరించి యువతిని రేప్ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

తిరుచ్చిలోని నిట్‌లో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న యువతి ప్రియుడితో కలిసి బస్టాప్‌లో ఉన్న యువతిని బెదిరించిన నిందితుడు అమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అక్రమ సంపాదన కోసం నకిలీ పోలీసు అవతారమెత్తిన ఓ యువకుడు ప్రేమజంటను బెదిరించి యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గంజాయి మత్తులో ఉన్న బాధితురాలు తనపై జరుగుతున్న అఘాయిత్యాన్ని అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది.

మహారాష్ట్రకు చెందిన ఓ యువతి తమిళనాడులోని తిరుచ్చి ఎన్ఐటీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మూడో సంవత్సరం చదువుతోంది. అక్కడే చెన్నైకి చెందిన విద్యార్థితో ప్రేమలో పడిన ఆమె అతడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఆదివారం రాత్రి సమయంలో కాలేజీకి దగ్గర్లో ఉన్న బస్టాప్‌లో ప్రేమికులిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

అదే సమయంలో పోలీసు యూనిఫామ్‌లో వచ్చిన ఓ వ్యక్తి ఇక్కడేం చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. ప్రియుడిపై చేయి చేసుకోవడంతో అతడు పారిపోయాడు. గంజాయి మత్తులో ఉన్న యువతిని ఎత్తుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి వదిలి వెళ్లిపోయాడు. బాధితురాలి ప్రియుడి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తువాక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఘటన ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని తిరుపెరంబూరుకు చెందిన మణికంఠన్‌‌గా గుర్తించారు. మంగళవారం అతడున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి వెళ్లారు. వారి రాకను గుర్తించిన మణికంఠన్‌ తప్పించుకునే క్రమంగా పరుగెత్తుతూ కింద పడిపోయాడు. కాళ్లకు ఫ్రాక్చర్ కావడంతో పోలీసులు అతడిని ఆస్పత్రిలో తరలించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here