గర్జించిన మేఘం..

0
2


గర్జించిన మేఘం..

ఉరుములు, మెరుపులతో వర్షం

పిడుగుపాటుకు ఏడు గేదెలు మృతి

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఆకాశం గర్జించింది. ఆర్మూర్‌ డివిజన్‌లో మోస్తరు వర్షాలు పడ్డాయి. మామిడిపల్లిలో ఐదు గేదెలు, రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. హఠాత్తుగా వచ్చిన వర్షంతో అన్నదాతలు హైరానా పడ్డారు. రెండున్నర లక్షల ఎకరాల్లో దాదాపు లక్ష ఎకరాల వరి పంట కోతకు వచ్చింది. ఈ వారం రోజుల్లో నూర్పిడిలు మొదలవుతున్నాయి. మరో వైపు వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్‌ పంటలు కోస్తున్నారు. కొంత కల్లాల మీదికి చేరింది. ఈ వర్షంతో రెండు, మూడు రోజుల్లో పంట కోసేందుకు సిద్ధమైన రైతన్నలు వెనుకడుగు వేశారు. ఆర్మూర్‌, కమ్మర్‌పల్లి, నందిపేట, బాల్కొండ, మోర్తాడ్‌, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లో సోయా, మక్క పంట తడిసిపోయింది. ఆగమేఘాల మీద రాశులపై తాటిపత్రిలు కప్పుకునేందుకు తంటాలు పడ్డారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here