గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

0
1


గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ


మాట్లాడుతున్న పాలనాధికారి సత్యనారాయణ, పక్కన ఎస్పీ శ్వేత

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. జనహిత భవన్‌లో శుక్రవారం నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడారు. మాతాశిశు సంరక్షణ చాలా ముఖ్యమని, వారి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతీ శుక్ర, సోమవారాల్లో గర్భిణుల ఆరోగ్య పర్యవేక్షణ చేయాలని కోరారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ పర్యవేక్షణకు ఐఏఎస్‌ అధికారి వెంకటేశ్‌ ధోత్రేను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని, జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ఆరోగ్య శిబిరాలను ఆయన పర్యవేక్షిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రత్యేకాధికారి వెంకటేశ్‌ధోత్రే, ఎస్పీ శ్వేత, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

అపారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం తగదు

కామారెడ్డి పట్టణం : అపారిశుద్ధ్యంపై పురపాలక యంత్రాంగం నిర్లక్ష్యం తగదని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పురపాలక కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 10 వేల జనాభాకు 28 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో 65 మంది సిబ్బంది తక్కువగా ఉన్నారని తెలిపారు. పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వహించే కార్మికుల నుంచి 20 మందిని వార్డుకు ఇద్దరి చొప్పున జవాన్లుగా నియమించాలని ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో ఆరు ఉద్యానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌, ఇన్‌ఛార్జి కమిషనర్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here