గాంధీ వేషధారణతో ఆకట్టుకున్న విద్యార్థులు

0
3


గాంధీ వేషధారణతో ఆకట్టుకున్న విద్యార్థులు

కంఠేశ్వర్‌: జాతీయ చేనేత దినోత్సవం, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన 150 మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో పట్టణంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ సంస్థల ఛైర్మన్‌ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ చౌక్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ నందురెడ్డి మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మాగాంధీ వారసులమైన మనమందరం చేనేత వస్త్రాలను ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/138299.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here