గాయానికి బౌలింగ్‌ యాక్షన్‌ కారణం కాదు.. బుమ్రా యాక్షన్‌ను మార్చుకోనక్కర్లేదు!!

0
2


న్యూఢిల్లీ: టీంఇండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పికి అతడి వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌ కారణం కాదు అని మాజీ పేసర్ అశీష్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు. బుమ్రా తన సహజమైన బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకోనక్కర్లేదు అని సూచించాడు. బుమ్రా వెన్నునొప్పికి అతడి వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షనే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. గాయాలకు, యాక్షన్‌కు సంబంధం ఉండదని నెహ్రా పేర్కొన్నాడు.

ఎంఎస్ ధోనీకి డిన్నర్ ఇచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్!!

యాక్షన్‌ను మార్చుకోనక్కర్లేదు:

యాక్షన్‌ను మార్చుకోనక్కర్లేదు:

వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. బుమ్రా గాయంపై నెహ్రా స్పందించాడు. ‘బౌలింగ్‌ యాక్షన్‌ వల్ల వెన్నునొప్పి రాదు. బుమ్రా యాక్షన్‌ను మార్చుకోనక్కర్లేదు. అలా ప్రయత్నిస్తే.. సరైన ఫలితాలు రాకపోవచ్చు. బుమ్రా అదే యాక్షన్‌, పేస్‌తో మళ్లీ బౌలింగ్‌ చేయాలి. బాల్‌ విసిరేటప్పుడు అతడి శరీరం పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. మలింగ కన్నా బుమ్రా యాక్షన్‌ 10 రెట్లు మెరుగ్గా ఉంటుంది’ అని నెహ్రా తెలిపాడు.

వెన్ను గాయం అంత తేలికైనది కాదు:

వెన్ను గాయం అంత తేలికైనది కాదు:

‘వెన్ను గాయం నుంచి కోలుకోవటానికి బుమ్రాకు దాదాపు రెండు నెలల సమయం పడుతుంది. కొన్ని సార్లు ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. మ్యాచ్‌కు ఎప్పుడు సిద్ధమనే విషయం ఆటగాడికి మాత్రమే తెలుసు. ఇతర గాయాల మాదిరిగా వెన్ను గాయం అంత తేలికైనది కాదు. ఈ గాయాన్ని ఎంఆర్‌ఐ స్కాన్‌లో గుర్తించలేం. ఎముకల స్కాన్‌ ప్లేట్స్‌ మాత్రమే గుర్తిస్తాయి’ అని నెహ్రా పేర్కొన్నాడు.

ఫాస్ట్‌ బౌలర్‌కు గాయాలు సహజం:

ఫాస్ట్‌ బౌలర్‌కు గాయాలు సహజం:

‘ఒక ఫాస్ట్‌ బౌలర్‌కు గాయాలు చాలా ఉంటాయి. దీంతో క్రికెట్‌కు దూరమవ్వలేము. వాటిని అధిగమించాలి. మూడేళ్ల నుంచి జట్టులో ఆడుతున్న బుమ్రాకు తన శరీరంపై పూర్తి అవగాహన ఉంది. అతడు గాయం నుంచి కోలుకుని అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.

బంగ్లాదేశ్ సిరీస్‌కూ దూరం:

బంగ్లాదేశ్ సిరీస్‌కూ దూరం:

బుమ్రా నవంబర్‌ చివరి వరకు జట్టుకు అందుబాటులో ఉండడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు అతడి స్థానంలో సెలక్టర్లు ఉమేశ్‌ యాదవ్‌కు చోటిచ్చారు. బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ప్రస్తుతం బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. బంగ్లాదేశ్ సిరీస్‌కూ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం తెలుస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here