గిరిరాజ్‌ విద్యార్థుల హంగామా

0
8


గిరిరాజ్‌ విద్యార్థుల హంగామా

నృత్యాలు చేస్తున్న విద్యార్థినులు

నిజామాబాద్‌ సాంస్కృతికం, కంఠేశ్వర్‌, న్యూస్‌టుడే: తెలుగు, హిందీ, ఇంగ్లిషు పాటలపై గిరిరాజ్‌ కళాశాల విద్యార్థులు తమ నృత్యాలతో అదరగొట్టారు. హిప్‌పాప్‌, పాప్‌ గీతాలపై నర్తించి అలరించారు. సంప్రదాయ వస్త్రధారణలతో విద్యార్థినులు ప్రత్యేకతను చాటుకున్నారు. బృందనృత్యాలు, లఘునాటికలు, హాస్యగుళికలతో హంగామా చేశారు. సోమవారం కళాశాల ప్రాంగణంలోని కళామందిరంలో బీఎస్సీ లైఫ్‌సైన్సెస్‌ విద్యార్థులు తమ జూనియర్స్‌కు ఆత్మీయంగా స్వాగతం పలికారు. కళాశాల ప్రధానాచార్యులు దుబ్బరాజం ముఖ్యఅతిథిగా హాజరై మార్గనిర్దేశం చేశారు. వైస్‌ప్రిన్సిపల్‌ అంకం గంగాధర్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here