గీత కార్మికుల చర్చలు సఫలం

0
0


గీత కార్మికుల చర్చలు సఫలం

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండలోని కల్లు డిపో పరిధిలోని గీత కార్మికులు, డిపో యాజమాన్యం మధ్య నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. వారం రోజుల క్రితం తమ వేతనాలను పెంచాలని కోరుతూ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. బుధవారం గీత కార్మికులు, డిపో యాజమాన్యం, సీఐటీయూ నాయకుడు ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో కార్మికులకు  అదనంగా రూ. 500 పెంపుదలకు అంగీకరించారు.  అందుకు కార్మికులు సమ్మతించి,  పనుల్లోకి వస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో డిపో యాజమాన్యం భీమాగౌడ్‌, సుదర్శన్‌గౌడ్‌, ప్రసాద్‌గౌడ్‌, గీత కార్మికుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here