గుండెపోటుతో అన్నదాత మృతి

0
2


గుండెపోటుతో అన్నదాత మృతి

పొలంలో మల్కన్నగారి అశోక్‌ మృతదేహం

వేల్పూర్‌, న్యూస్‌టుడే: వేల్పూర్‌కు చెందిన మల్కన్నగారి అశోక్‌(40) ఆదివారం తన పొలంలో గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె రోడ్డు సమీపంలో ఉన్న తన క్షేత్రానికి ఆయన నీళ్లు పెట్టడానికి ఉదయం వెళ్లాడు. ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై నిలిపి, చెప్పులు పొలం గట్టుపై వదిలి లోనికి వెళ్లాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో పొలంలో పడిపోయాడు. బురదలో కూరుకపోవడంతో ఊపిరాడక సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.ఆయన ఇంటికి రాకపోవడంతో.. కుటుంబీకులు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మధ్యాహ్నం తిరిగి పొలంలో వెతకగా బురదలో శవమై కనిపించాడు. ఆయనకు భార్య ఇందిర, కుమారుడు, కూతురు ఉన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here