గుజరాత్ లో మ్యాగీ కొత్త ప్లాంటు … రూ 700 కోట్ల పెట్టుబడి

0
2


గుజరాత్ లో మ్యాగీ కొత్త ప్లాంటు … రూ 700 కోట్ల పెట్టుబడి

ప్రముఖ బహుళ జాతి కంపెనీ (MNC) నెస్లే … భారత్ లో తన పెట్టుబడులను కొనసాగిస్తోంది. మాక్ ఇన్ ఇండియా లో భాగంగా దేశంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని స్పష్టం చేస్తోంది. ఇందుకు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. తాజాగా గుజరాత్ లో మేగీ నూడుల్స్ తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్ సమీపంలోని సనంద్ లో ఈ కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని నెస్లే తెలిపింది. ఇందుకోసం ఏకంగా రూ 700 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. స్విట్జర్లాండ్ కు చెందిన నెస్లే… అయ్యారా పదార్థాలు, పానీయాలను తయారు చేసే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటి. చిన్న పిల్లలకు పోషకాహార పదార్థాలను తయారు చేయడంలో ఈ కంపెనీకి తిరుగు లేని రికార్డు ఉంది. సెరిలాక్ వంటి ఉత్పత్తులతో భారత్ లో చిన్న పిల్లల ఫుడ్ అంటే అదే అన్నంత ఆదరణను పొందింది నెస్లే.

దూసుకు పోతున్న మ్యాగీ…

పరిమితికి మించిన రసాయనాలను వాడుతోందన్న ఆరోపణల మధ్య మ్యాగీ నూడుల్స్ కొంత కాలం అందుబాటులో లేవు. కానీ తర్వాత అందులో అలంటి హానికారక పదార్థాలు మోతాదు మించి లేవని నిరూపితం ఐన తర్వాత … మ్యాగీ అమ్మకాలను మల్లె ప్రారంభించింది నెస్లే. ఒక దశల స్వతచందంగానే నెస్లే ఈ నిర్ణయాన్ని తీసుకోండి. సుమారు రూ 600-700 కోట్ల మేరకు నష్టపోయిన భారత్ మార్కెట్ నుంచి మాత్రం వెనక్కు వెళ్ళలేదు. తిరిగి మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన తర్వాత మ్యాగీ అమ్మకాలు గతంలో కంటే అధికంగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్స్టెంట్ నూడుల్స్ రంగంలోని మిగితా కంపెనీల ప్రొడక్టులతో పోల్చితే మ్యాగీ నూడుల్స్ చాలా ముందున్నాయని చెబుతున్నారు.

ఫలితం లేని పతంజలి నూడుల్స్...

ఫలితం లేని పతంజలి నూడుల్స్…

ఒక వైపు మ్యాగీ నిషేధం తో నెస్లే ఇబ్బంది పడుతున్న సమయం లోనే … యోగ గురువు రాందేవ్ బాబా కు చెందిన పతంజలి సంస్థ భారత్ మార్కెట్లోకి దేశీయ నూడుల్స్ ను ప్రవేశ పెట్టింది. అప్పుడు మ్యాగ్గి పై నిషేధం ఉండటం తో తోలుత అమ్మకాలు బాగానే ఉన్న… మ్యాగీ మళ్ళీ మార్కెట్లోకి వచ్చాక మాత్రం పతంజలి నూడుల్స్ ప్రభావం తగ్గిపోయిందని కిరానా యజమానులు తెలిపారు. ఈ మధ్యలో ఐటీసీ కంపెనీకు చెందిన ఇప్పీ నూడుల్స్ కొంత మెరుగ్గా అమ్ముడు పోతున్నాయని వారు వెల్లడించారు.

నెస్లే తొమ్మిదో ప్లాంటు...

నెస్లే తొమ్మిదో ప్లాంటు…

ఇదిలా ఉండగా .. నెస్లే ప్రస్తుతం గుజరాత్ లోని సనంద్ లో ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీ తమకు భారత్ లో 9వ ప్లాంటు అని నెస్లే ఇండియా చైర్మన్ సురేష్ నారాయణ్ వెల్లడించారు. ఇండియా లో నెస్లే తన తోలి ఫ్యాక్టరీ ని పంజాబ్ లోని మోగా లో 1961లో ఏర్పాటు చేసింది. తోలి త్రైమాషికంలో నెస్లే ఇండియా మెరుగైన ఫలితాలను వెల్లడించింది. అమ్మకాల్లో 11.35% వృద్ధితో రూ 2,983 కోట్లను ఆర్జించింది. దీనిపై రూ 438 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాషికంతో పోల్చితే లాభం కూడా 11% పెరిగింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here