గుట్కా విక్రయ దుకాణాలపై దాడులు

0
1


గుట్కా విక్రయ దుకాణాలపై దాడులు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌లోని గంజ్‌లో గుట్కా విక్రయాలు చేస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు జరిపారు. శనివారం ఈనాడులో వచ్చిన గుట్కా విక్రయాలపై దాడులేవీ కథనానికి పోలీసులు స్పందించారు. గంజ్‌ ప్రాంతంలోని పలు దుకాణాల్లో రహస్యంగా గుట్కాను విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. మూడు దుకాణాల్లో గుట్కా నిల్వలు దొరికాయి. స్వాధీనం చేసుకొన్న గుట్కా విలువ సుమారు రూ.1.25 లక్షలు ఉంటుందని తెలిపారు. దుకాణం యజమానులపై కేసులు నమోదు చేశామని ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఇంకా ఇలాంటి గుట్కా విక్రయదారులు నగరంలో చాలా మంది ఉన్నారు. వాళ్లపై కూడా దృష్టి సారించాల్సి ఉంది.

https://betagallery.eenadu.net/htmlfiles/140206.html

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here