గుడ్‌న్యూస్: ఓ బ్యాంక్ కస్టమర్‌కు ఏ బ్యాంక్ నుంచైనా సేవలు ఉచితం!!

0
3


గుడ్‌న్యూస్: ఓ బ్యాంక్ కస్టమర్‌కు ఏ బ్యాంక్ నుంచైనా సేవలు ఉచితం!!

టెక్నాలజీ పుణ్యాన ఎన్నో అవసరాలను మనం చేతివేళ్ల పైనే పూర్తి చేసుకుంటున్నాము. బ్యాంకు సేవలు కూడా రోజు రోజుకు సులభతరం అవుతున్నాయి. సెకండ్లు, నిమిషాల్లో ఇప్పుడు మనీ ట్రాన్సుఫర్ చేయగలుగుతున్నాం. పర్సనల్ లోన్, ఆటో లోన్‌లను ఆన్ లైన్ ద్వారా పొందుతున్నాం. దీంతో గంటల్లో మన లోన్ అమౌంట్ మన అకౌంట్స్‌లో పడుతోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్స్, మ్యుచువల్ ఫండ్స్ పెట్టుబడులు, స్టాక్స్ వంటి వాటిల్లో ఈజీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం.

బ్యాంకింగ్ వ్యవస్థ మరింత సులభతరం

బ్యాంకింగ్ వ్యవస్థను కస్టమర్లకు మరింత చేరువ చేస్తామని, ఆన్‌లైన్ పర్సనల్ లోన్స్, డోర్‌స్టెప్ బ్యాంకింగ్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు కస్టమర్‌కు ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో (PSU)సేవలు వంటి సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు. బ్యాంకింగ్ వ్యవస్థను కస్టమర్లకు మరింత సులభతరం చేస్తామన్నారు. ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కస్టమర్లకు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు పొందే వీలు కల్పిస్తామన్నారు.

ఇది గుడ్‌న్యూసే...

ఇది గుడ్‌న్యూసే…

ఇది కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. దీని ద్వారా రానున్న రోజుల్లో ఓ బ్యాంకు కస్టమర్లు తమ సమీపంలోని మరో బ్యాంకుకు వెళ్లి బ్యాంకింగ్ సేవలు పొందే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఓ పీఎస్‌యూ బ్యాంక్ కస్టమర్ అన్ని పీఎస్‌యూ బ్యాంకుల్లో సేవలు పొందలేడు.

ఈ బ్యాంకుల్లో అందుబాటులోకి సౌకర్యం

ఈ బ్యాంకుల్లో అందుబాటులోకి సౌకర్యం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)కస్టమర్లకు తొలుత ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. పీఎస్‌యూ బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధనం సమకూర్చుతామని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏడాదికి రూ.1కోటికి పైగా ట్రాన్సాక్షన్స్ చేస్తే 2 శాతం ట్యాక్స్ ఉంటుంది. ఏడాదికి రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన కంపెనీలు BHIM, UPI, Aadhaar Pay, Debit cards, NEFT, RTGS వంటివి ఉపయోగించాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here