గుడ్‌న్యూస్: ఖరీఫ్ నుంచే పంటబీమా అమలు, గడువు పెంపు

0
0


గుడ్‌న్యూస్: ఖరీఫ్ నుంచే పంటబీమా అమలు, గడువు పెంపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంట బీమా పథకాన్ని ఖరీఫ్ నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ పథకం కింద అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వారి తరఫున బీమా కంపెనీలకు ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తోంది. ప్రధానమంత్రి పంటల బీమా (PMFBY), ఆధునీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా స్కీం (RWBCIS) అమలులో ఉన్నాయి. PMFBY అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నారు.

రూపాయి చెల్లిస్తే చాలు…

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఒక్క రూపాయి చెల్లించి పంట బీమా పథకంలో చేరాలి. రుణాలు పొందే రైతుల నుంచి బ్యాంకులే స్వయంగా ఒక్క రూపాయి మినహాయించుకొని బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. రుణాలు తీసుకోని రైతులు మాత్రం మీ సేవా కేంద్రంలో రూపాయి చెల్లించి రైతు పేరు, సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, భూమి వివరాలు నమోదు చేయించుకోవాలి. రైతులు రూపాయి ఇచ్చి స్కీంలో చేరితే, ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.1,163 కోట్లు కేటాయించారు.

ఇది వరకు ఇలా.. ఇప్పుడు ప్రభుత్వమే చెల్లిస్తుంది

ఇది వరకు ఇలా.. ఇప్పుడు ప్రభుత్వమే చెల్లిస్తుంది

ఇదివరకు, బీమా సంస్థలు నిర్ణయించిన ప్రకారం రైతులు ప్రీమియం విలువలో 2 శాతం నుంచి 5 శాతం చెల్లిస్తే మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున చెల్లించేవి. ఇప్పుడు ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించనుంది. దీంతో రైతులు అందరూ లబ్ధి పొందే అవకాశముంది. కేవలం రూపాయితో స్కీంలో చేరితే చాలు. కౌలు రైతుల తరఫున కూడా ప్రభుత్వమే పంట బీమా చెల్లిస్తుంది.

గుడ్‌న్యూస్... ఆగస్ట్ చివరి వరకు పొడిగింపు

గుడ్‌న్యూస్… ఆగస్ట్ చివరి వరకు పొడిగింపు

పంట బీమా ప్రీమియం చెల్లింపుకు తొలుత జూలై 31వ తేదీ వరకు గడువు విధించారు. ఇప్పుడు ఆగస్ట్ చివరి వరకు పొడిగించారు. కేవలం ఒక్క రూపాయితోనే పంట బీమా సౌకర్యం అందరు రైతులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలు నమోదు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని, కానీ వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చేయలేదని, అలాగే వర్షాలు ఆలస్యంగా రావడంతో ఇప్పటి వరకు ప్రాజెక్టుల్లో నీరు చేరలేదని, ఈ నేపథ్యంలో పంట బీమా నమోదు గడువు పెంచాలని ఇటీవల డిమాండ్లు కూడా వచ్చాయి. ప్రభుత్వం కూడా దీనిని పొడిగించింది.

గురువారం వరకు బీమా పొందిన రైతులు

గురువారం వరకు బీమా పొందిన రైతులు

ఆగస్ట్ 1వ తేదీ వరకు పలువురు రైతులు పంట బీమా పొందారు. PMFBY, RWBCIS కింద రుణం పొందిన, రుణం తీసుకొని రైతులు ఈ బీమా సౌకర్యం పొందారు. అనంతపురం, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాలు టాప్‌లో నిలిచారు. మొత్తంగా ఐదున్నర లక్షల మంది రుణం పొందిన రైతులు, దాదాపు 2 లక్షల 70వేల మంది రుణం పొందని రైతులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here