గుడ్‌న్యూస్: రూ.100 వరకు తగ్గిన చికెన్ ధరలు!

0
0


గుడ్‌న్యూస్: రూ.100 వరకు తగ్గిన చికెన్ ధరలు!

హైదరాబాద్: మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్‌ను ఇష్టపడేవారికి గుడ్ న్యూస్. ఎండాకాలంలో చికెన్ ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. ఏకంగా రూ.280 వరకు పలికింది. చికెన్ తినేవారికి ఈ ధరతో చుక్కలు కనిపించాయి. అయితే ఇప్పుడు చికెన్ ధరలు తగ్గాయి! కొన్ని ప్రాంతాల్లో రూ.180 వరకు ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో రూ.200 అటు ఇటుగా ఉన్నాయి. దాదాపు రూ.100 వరకు తగ్గింది.

రూ.280 నుంచి రూ.170కి పడిపోయిన చికెన్

పది రోజుల క్రితం వరకు రూ.280 పలికిన చికెన్ ధర ప్రస్తుతం రూ.170కి దిగి వచ్చింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ ధర రూ.170, రూ.180గా ఉన్నప్పటికీ దుకాణాల వద్ద కొనేవారు పెద్దగా లేరు. శ్రావణ మాసం కావడంతో మాంసాహారానికి చాలామంది నగరవాసులు దూరంగా ఉన్నారు.

శ్రావణ మాసం ఎఫెక్ట్

శ్రావణ మాసం ఎఫెక్ట్

శ్రావణమాసం కారణంగా చికెన్‌కు దూరంగా ఉండటంతో వినియోగం బాగా తగ్గింది. అమ్మకాలు రోజువారీతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో డిమాండ్ తగ్గి, రేటు పడిపోయింది. చికెన్ ధర రూ.100 వరకు తగ్గింది. సోమవారం బక్రీద్ నేపథ్యంలో అమ్మకాలు ఇతర రోజులతో పోలిస్తే (శ్రావణం మాసం) కాస్త ఎక్కువగా ఉన్నాయి.

దాదాపు సగానికి పైగా తగ్గిన డిమాండ్

దాదాపు సగానికి పైగా తగ్గిన డిమాండ్

తెలంగాణవాసులు, ఇందులోను హైదరాబాదీయులు చికెన్ తినేందుకు మక్కువ చూపిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదున్నర లక్షల కిలోలకు పైగా చికెన్ వినియోగం ఉంటుంది. ఇందులో దాదాపు సగం వరకు వినియోగం గ్రేటర్ పరిధిలో ఉంటుంది. శ్రావణ మాసం కారణంగా దుకాణాల వద్ద రద్దీ తగ్గింది. అమ్మకాలు సగం కంటే ఎక్కువగా పడిపోయాయట.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here