గుడ్‌న్యూస్: రూ.80,000 తగ్గిన టిగోర్ ఎలక్ట్రిక్ కారు ధర

0
0


గుడ్‌న్యూస్: రూ.80,000 తగ్గిన టిగోర్ ఎలక్ట్రిక్ కారు ధర

ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అదే సమయంలో ఇతర ప్రయోజనాలు కూడా కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీలకు, అలాగే వినియోగదారులకు కాస్త భారం తగ్గనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయోజనాలను కంపెనీలు కస్టమర్లకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్ టిగోర్ ఈవీ ధరను తగ్గించింది.

రూ.80,000 తగ్గనున్న టిగోర్ ఈవీ

టిగోర్ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికిల్) ధరను రూ.80,000 వరకు టాటా మోటార్స్ తగ్గించింది. తక్షణమే ఈ ధరల తగ్గింపు అమల్లోకి వస్తుందని ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

జీఎస్టీ ప్రయోజనం వినియోగదారులకు బదలాయింపు

జీఎస్టీ ప్రయోజనం వినియోగదారులకు బదలాయింపు

ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ రేట్లను 5 శాతానికి తగ్గించేందుకు ఇటీవల జీఎస్టీ కౌన్సెల్ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆ మేరకు ప్రయోజనాన్ని వినియోగదార్లకు బదలాయించాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. టిగోర్ ఈవీ అన్ని రకాల వేరియంట్లకు ఎక్స్ఈ (బేస్), ఎక్స్ఎమ్ (ప్రీమియం), ఎక్స్‌టీ (హై)లకు ఈ ధరల తగ్గింపు వర్తిస్తుంది.

ఇవి ఇంక్లూడ్ కాలేదు..

ఇవి ఇంక్లూడ్ కాలేదు..

ఇంతకుముందు టిగోర్ ఈవీ ధర రూ.12.35 లక్షల నుంచి రూ.12.71 లక్షల (ఎక్స్ షోరూమ్, ముంబై)గా ఉంది. ఇప్పుడు ఇది రూ.11.58 లక్షల నుంచి రూ.11.92 లక్షలకు రానుంది. ఈ ధరల్లో FAME II (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మానుఫ్యాక్చర్ ఆఫ్ (హైబ్రిడ్ అండ్) ఎలక్ట్రిక్ వెహికిల్స్) సబ్సిడీని ఇంక్లూడ్ చేయలేదు. టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) కూడా కలపలేదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here