గుడ్‍‌న్యూస్: సీనియర్ సిటిజన్లకు యస్ బ్యాంక్ అదనపు ప్రయోజనాలు

0
1


గుడ్‍‌న్యూస్: సీనియర్ సిటిజన్లకు యస్ బ్యాంక్ అదనపు ప్రయోజనాలు

ముంబై: ప్రయివేటురంగ నాలుగో అతిపెద్ద బ్యాంకు యస్ బ్యాంకు సీనియర్ సిటిజన్ అకౌంట్ హోల్డర్స్ కోసం ప్రత్యేక సేవలను ప్రారంభించింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఓవర్ డ్రాఫ్టు మీద ఆకర్షణీయ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే సేఫ్ లాకర్ ఫెసిలిటీని కల్పిస్తున్నట్లు తెలిపింది. వృద్ధులకు బ్యాంకు సేవలు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నయ్లు యస్ బ్యాంకు సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ రాజన్ తెలిపారు.

సేవింగ్ అకౌంట్స్‌పై 6 శాతం వడ్డీ

యస్ బ్యాంక్ సీనియర్‌ సిటిజన్‌ ఖాతాదారులకు ఇది శుభవార్త. సేవింగ్ అకౌంట్లకు వివిధ అదనపు ప్రయోజనాలు కల్పిస్తుంది. సేవింగ్ అకౌంట్లపై 6% వడ్డీని అందిస్తుంది. హెల్త్ కేర్, ట్రావెల్, ఫిట్‌నెస్ బ్రాండ్‌లలో డిస్కౌంట్ లేదా ఇతర ప్రయోజనాలతో కూడిన ప్రత్యేకమైన బుక్ లెట్ అందిస్తుంది.

అదనపు ప్రయోజనాలు

అదనపు ప్రయోజనాలు

ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా ఈజీగా నగదు, డిపాజిట్ లాకర్ రక్షణ సౌకర్యంపై డిస్కౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల(FD)పై అదనంగా 0.5 శాతం వడ్డీ, ఆదాయ సంబంధిత FDలకు నెల నెలా వడ్డీ చెల్లింపు సౌకర్యం, జీవితకాలం ఉచితంగా రుపే దేశీయ డెబిట్ కార్డు, అన్ని యస్ బ్యాంక్ ఏటీఎంలలో అపరిమిత నగదు ఉపసంహరణ సౌకర్యాలను కల్పిస్తోంది.

వారి అవసరాలు భిన్నం

వారి అవసరాలు భిన్నం

తాము కస్టమర్లకు అవసరమైన ఉత్పత్తుల పైన ఫోకస్ చేస్తున్నామని, వారికి అవసరమైన సేవలు అందించేందుకు ముందుంటామని రాజన్ చెప్పారు. సీనియర్ సిటిజన్ల బ్యాంకింగ్ అవసరాలు, ప్రాధాన్యతల ఇతర వయస్సుల వారితో పోలిస్తే భిన్నంగా ఉంటాయన్నారు. వారి అవసరాలు తాము అర్థం చేసుకున్నామన్నారు. యస్ బ్యాంకుకు 1,122 బ్రాంచీలు, 1,395కు పైగా ఏటీఎంలు ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యస్ మొబైల్ యాప్, చాట్ బోట్ వంటివి ఆఫర్ చేస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here