గుడ్ న్యూస్: నెఫ్ట్ లావాదేవీలకు చార్జీలు ఉండవు

0
1


గుడ్ న్యూస్: నెఫ్ట్ లావాదేవీలకు చార్జీలు ఉండవు

సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ) శుభవార్త చెప్పింది. ఇకపై నెఫ్ట్ లావాదేవీలకు చార్జీలు ఉండబోవని స్పష్టం చేసింది. దీంతో కొత్త సంవత్సరంలో వినియోగదారులు ఎంచక్కా ఉచిత నెఫ్ట్ లావాదేవీలను ఎంజాయ్ చేయవచ్చు.

జనవరి, 2020 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆర్ బి ఐ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది. అందులో బ్యాంకు లో సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారుల కు వచ్చే జనవరి నుంచి ఎలాంటి రుసుములను వసూలు చేయరాదని బ్యాంకులను ఆదేశించింది.

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఏడాది జులై లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా నెఫ్ట్ తో పాటు ఆర్ టీ జి ఎస్ లావాదేవీలకు కూడా చార్జీలను రద్దు చేయాలనుకొంటున్నట్లు వెల్లడించింది. దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహహించటం కోసం ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొంది.

అందుకోసం ఇప్పటి వరకు రిజర్వు బ్యాంకు విధిస్తున్న లావాదేవీల చార్జీలను రద్దు చేయనున్నట్లు తెలిపింది. దీంతో ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదలాయించాలని కోరింది. అయితే, నెఫ్ట్ పై చార్జీలను రద్దు చేసినట్లు ప్రకటించిన ఆర్ బి ఐ కేవలం జనవరి నెల అని మాత్రమే చెప్పింది. ప్రరత్యేకంగా ఏ తేదీని ఇందుకోసం నిర్ణయించలేదు.

డిజిటల్ లో 96%….

పెద్ద నోట్లు రద్దు చేసి మూడేళ్లు ఐన సందర్భంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దేశంలో డిజిటల్ లావాదేవీల సరళిని ప్రకటించింది. ఇందులో భాగంగా నాన్ కాష్ రిటైల్ పేమెంట్ల లో 96% ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు ఉంటున్నాయని పేర్కొంది. 2018 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలం లో ఈ సరళి కనిపించిందని ఆర్ బి ఐ వెల్లడించింది. ఇదే సమయంలో నెఫ్ట్ లావాదేవీలు 252 కోట్లు, యూపీఐ లావాదేవీలు 874 కోట్ల మేరకు జరిగాయని చెప్పింది. నెఫ్ట్ లావాదేవీల్లో 20% వృద్ధి నమోదు కాగా, యూపీఐ లావాదేవీల్లో 263% వృద్ధి కనిపించిందని ఆర్ బి ఐ తెలిపింది. తాము తీసుకొన్న అనేక చర్యల కారణంగానే ఇదంతా సాధ్యపడిందని ఆర్ బి ఐ అభిప్రాయపడింది.

క్యూ ఆర్ కోడ్ లపై కమిటీ ...

క్యూ ఆర్ కోడ్ లపై కమిటీ …

దేశంలో మరింతగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అనేక కొత్త చర్యలు తీసుకొంటోంది. ఇందులో భాగంగా కొత్తగా దేశంలో క్యూ ఆర్ కోడ్ వినియోగం పెంచేందుకు, ఇందులో ఇమిడి ఉన్న ప్రయోజనాలను అధ్యయనం చేసేందుకు, అలాగే దీనిపై వినియోగదారుల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక కమిటీని నియమించింది. ఫాస్టాగ్ చెల్లింపుల కోసం అన్ని ప్రైవేట్ తో సహా అన్ని రకాల చెల్లింపు విధానాలను అనుసంధానం చేయాలనీ నిర్ణయించింది. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలకు సైతం ఈ-మ్యాండేట్ సౌకర్యాన్ని కల్పించింది. దేశంలో డిజిటల్ లావాదేవీలను అనుమతించే మౌలికసదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేసిన యాక్సెప్టెన్స్ డెవలప్మెంట్ ఫండ్ కార్యకలాపాల ప్రారంభానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పచ్చ జెండా ఊపింది.

మిగతా వాటిపై కూడా దయ చూపండి..

మిగతా వాటిపై కూడా దయ చూపండి..

నెఫ్ట్ పై చార్జీలను రద్దు చేసినట్లే .. త్వరలోనే ఐ ఎం పీ ఎస్, ఆర్ టీ జి ఎస్ సహా ఇతర లావాదేవీల చార్జీలను కూడా రద్దు చేయాలనీ ఖాతాదారులు కోరుతున్నారు. అలాగే అన్ని రకాల మర్చంట్ల వద్ద జరుగుతున్న లావాదేవీలకు కూడా ఎం డీ ఆర్ చార్జీలను కూడా ఎత్తివేయాలని సూచిస్తున్నారు. దీంతో దేశంలో పూర్తి స్థాయిలో డిజిటల్ లావాదేవీలు జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here