గుర్తించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలి

0
2


గుర్తించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలి


సమావేశంలో మాట్లాడుతున్న కమర్షియల్‌ విభాగం డైరెక్టర్‌ సంధ్యారాణి

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు వారోత్సవాల్లో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎన్‌పీడీసీఎల్‌ కమర్షియల్‌ విభాగం డైరెక్టర్‌ సంధ్యారాణి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పవర్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. గ్రామాల్లో వేలాడుతున్న విద్యుత్తు తీగలను వెంటనే సరిచేయాలని, వీధిదీపాలు పగలు వెలగకుండా ప్రత్యేక లైను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వీధి దీపానికి మీటర్లు ఉండేలా చూడాలన్నారు. వంగిన, తుప్పుపట్టిన స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయలని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఈ సుదర్శన్‌, డీఈలు, ఏడీఈలు పాల్గొన్నారు.

భద్రతపై నిర్లక్ష్యం వద్దు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో విద్యుత్తు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదోగ్యులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈ సుదర్శన్‌ సూచించారు. బుధవారం రాత్రి జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబ్బందికి కేటాయించిన రబ్బరు గ్లౌజులు, ఎర్త్‌రాడ్లు, ఓల్టేజీ స్టార్‌ వంటి పరికరాలను తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. వేలాడుతున్న విద్యుత్తు తీగలు, వంగిన స్తంభాల విషయంలో వెంటనే స్పందించాలని చెప్పారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here