గుర్తింపులో గురువులు వెనకడుగు

0
4


గుర్తింపులో గురువులు వెనకడుగు

ముందుకు సాగని గుర్తింపు కార్డుల ప్రక్రియ

చిత్రాల అప్‌లోడ్‌కు స్పందించని ఉపాధ్యాయులు

ఇప్పటి వరకు 44.30 శాతమే చేపట్టిన వైనం

ఈ నెల 15 చివరి తేదీ

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురువులు ‘గుర్తి’ంపులో వెనకడుగు వేస్తున్నారు. గుర్తింపు కార్డులు తీసుకోవడానికి ముందుకురావడం లేదు. విద్యాశాఖ వెబ్‌సైట్లో తమ చిత్రాలను అప్‌లోడ్‌ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో గడువు పెంచుతున్నా పట్టించుకోవడం లేదు. ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు 44.30 శాతం ఉపాధ్యాయులు మాత్రమే తమ వివరాలు నమోదు చేశారు. తాజాగా ఈ నెల 15ను చివరి తేదీగా నిర్ణయించారు. మరి నిర్ణీత సమయంలోగా ఎంత మంది స్పందిస్తారనేదానిపై సందిగ్ధం నెలకొంది.

భయ జిల్లాల్లో మొత్తం 19,679 మంది ఉపాధ్యాయులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బినామీ ఉపాధ్యాయుల నిర్మూలనకు శాశ్వత రీతిలో గుర్తింపు కార్డులు ఇవ్వడానికి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించిన నేపథ్యంలో.. వివిధ యాజమాన్యాల వారీగా(గురుకుల, స్థానిక సంస్థలు, ఆదర్శర, ఇతర) టీచర్లకు గుర్తింపు కార్డులివ్వాలని విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. జులై 31 అందరూ తమ చిత్రాలను అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించినా కనీస స్పందన కరవైంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో రెండు సార్లు గడువు పొడిగించినా అడుగులు ముందుకు పడటం లేదు. కొన్ని మండలాల్లో 90 శాతం ప్రక్రియ పూర్తయితే.. మరికొన్ని చోట్ల 20 శాతమైనా దాటని పరిస్థితి ఉంది.

పారదర్శకత కోసమే

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత బడులు కలిపి ఉభయ జిల్లాల్లో 2,326 ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు తమకు బదులుగా ఇతరులతో పని చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దస్త్రాల్లో ఒకరి పేరుంటే మరొకరు బోధిస్తున్నారు. ఈ అక్రమ తతంగానికి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన గుర్తింపు కార్డులు జారీ చేయాలని భావించింది. పంతుళ్ల ఆధార్‌ను అనుసంధానం చేసిన కార్డులను వచ్చే నెల చివరి నాటికి ఇవ్వాలని నిర్ణయించింది.

జీపీఎస్‌తో అనుసంధానం

పాఠశాలలను జీపీఎస్‌తో అనుసంధానం చేశారు. భవిష్యత్తులో అన్నింటిలో బయోమెట్రిక్‌ విధానం వర్తింపజేస్తే తప్పనిసరి ప్రతి గురువు తన గుర్తింపు కార్డును ఉపయోగించాలి. అధునాతన పరిజ్ఞానంతో ఫొటో, చిప్‌లతో కూడిన కార్డులను రూపొందిస్తున్నారు. వీటివల్ల పనివేళల్లో ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది. తద్వారా విద్యావిధానంలో పారదర్శకత పెరగనుంది.

ప్రతి ఒక్కరు స్పందించాలి – రాజు, డీఈవో-కామారెడ్డి

ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై ప్రతి ఒక్కరు స్పందించాలి. వెబ్‌సైట్‌లో వారి చిత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఈ నెల 15వ తేదీలోగా ముందుకు రావాలి. పారదర్శకతను పెంపొందించడానికి నూతన విధానం ఉపకరిస్తుందని భావిస్తున్నాం.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here