గూగుల్, పేస్‌బుక్‌లకు షాక్: ఎందుకంటే…!

0
3


గూగుల్, పేస్‌బుక్‌లకు షాక్: ఎందుకంటే…!

ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్, సోషల్ మీడియా మొఘల్ పేస్ బుక్ వంటి డిజిటల్ కంపెనీలకు షాక్ లాంటి వార్త. ఇలాంటి కంపెనీలపై భారత్ కొత్తగా డిజిటల్ టాక్స్ విధించాలని భావిస్తోంది. చాలా కాలంగా ఈ కంపెనీలు భారత్ లో సేవలు అందిస్తూ భారీగా ఆర్జిస్తున్నా … పన్ను చెల్లింపు విధానంలో నెలకొన్న సంక్లిష్టత వల్ల వాటి నుంచి మనకు లభిస్తున్న పన్ను ఆదాయం తక్కువగా ఉంటోందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే డిజిటల్ కంపెనీల పన్ను విధానం పై ఇప్పటి వరకు ఉన్న ఆర్గనైజషన్ ఫర్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసిడీ) లోని నిబంధనల్ని మార్చాలని కోరుతోంది. ఇండియా ప్రతిపాదిస్తున్న పన్ను అమల్లోకి వస్తే గూగుల్, పేస్ బుక్, ఉబెర్, నెట్ ఫ్లిక్స్ వంటి దిగ్గజాలకు కొత్త చిక్కు వచ్చి పడినట్లే. ప్రస్తుుమున్న నిబంధనల ప్రకారం ఈ కంపెనీలు కార్యకలాపాలకు అనుగుణంగా పన్ను చెల్లించడాన్ని అడ్డుకొంటున్నాయి. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.

విడుదలైన డ్రాఫ్ట్ …

కాగా ఇప్పటికే ఓఈసిడీ డిజిటల్ కంపెనీలకు సంబంధించిన విధి విధానాలను విడుదల చేసింది. అక్టోబర్ 9 న డ్రాఫ్ట్ ను విడుదల చేసి పబ్లిక్ కామెంట్ కోసం అందుబాటులో ఉంచారు. దీనిపై సభ్య దేశాలు అన్నీ తమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉంటుంది. అలాగే అన్ని దేశాలు ఈ ప్రతిపాదనలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన తదుపరి చర్చలు నవంబర్ 21, 22 తేదీల్లో జరుగనున్నాయి.

6% డిజిటల్ టాక్స్ ...

6% డిజిటల్ టాక్స్ …

ఇదిలా ఉండగా… భారత్ ఇప్పటికే 2016 లో ఇలాంటి కంపెనీలపై 6% డిజిటల్ టాక్స్ విధించింది. కానీ ఓఈసిడీ నిబంధనల మూలంగా దీనిని మనకు చెల్లించటం లేదు. అందుకే భారత్ ఈ సారి ఎలాగైనా తమ ప్రతిపాదనలకు పూర్తిస్థాయిలో ఆమోదం పొందేలా చర్యలు చేపడుతోంది. ఇండియా లో గూగుల్, పేస్ బుక్ వంటి కంపెనీలకు భారీగా ఆదాయం సమకూరుతున్నా … లభించే పన్ను మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. కొన్ని సార్లు సేవలు తీసుకొన్న వారు మాత్రమే పన్ను చెల్లించాల్సి వస్తోంది. సేవలు అందించిన కంపెనీ వేరే ప్రదేశం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లైతే ఆ కంపెనీ పన్ను చెల్లించేందుకు అంగీకరించటం లేదు.

పన్నుకు మూలం ఏది ...

పన్నుకు మూలం ఏది …

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కంపెనీ తమ బేస్ కంట్రీ ని మాత్రమే పన్ను చెల్లింపుకు మూలంగా భావిస్తోంది. ఉదాహరణకు ఉబెర్ తన ప్రధాన కేంద్రాన్ని అమెరికా లో కలిగి ఉంటె… సాఫ్ట్ వేర్ మరెక్కడో ఉంటుంది. కానీ అదే సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తూ భారత్ వంటి దేశాల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కాబట్టి కంపెనీలకు లభించే ఆదాయం ఆధారంగానే పన్ను చెల్లింపు విధానం కూడా ఉండాలని భారత్ కోరుతోంది. అయితే, దీనిని ఎలా పరిష్కరించాలనేది ప్రతిష్టంభన లో పడింది. ఒక దేశంలో ఒక కంపెనీకి ఉన్న ఉద్యోగుల ఆధారంగా పన్ను విధించాలా, లేదంటే ఆ కంపెనీకి ఉన్న ఆస్తుల పరంగా పన్ను విధించాలా అన్నది కూడా పరిశీలనలో ఉంది. కానీ కంపెనీ ఆదాయం ఆధారంగానే పన్ను విధించాలన్నది భారత్ వాదనగా ఉంటోంది. దీనికి మద్దతు లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ఒప్పుకునేది లేదు...

ఒప్పుకునేది లేదు…

గూగుల్, పేస్ బుక్, ఉబెర్ వంటి కంపెనీలు భారత్ లో అధిక ఆదాయాలు ఆర్జిస్తున్నా … పన్ను చెల్లింపులో ఆ మేరకు ఇండియాకు రాబడి ఉండటం లేదు. అందుకే ఓఈసిడీ ప్రస్తుత నిబంధనలను అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేస్తోంది. ఈ మేరకు భారత్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించినట్లు ఈటీ పేర్కొంది. ఒక వేల భారత్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే మాత్రం గూగుల్, పేస్ బుక్ వంటి కంపెనీలు డిజిటల్ టాక్స్ రూపంలో అధిక పన్ను చెల్లించేందుకు సిద్ధం కావాల్సిందే.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here