గొడవపడి.. తనువు చాలించి

0
5


గొడవపడి.. తనువు చాలించి

రబియా బుస్రా

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ నగరంలోని ఆటోనగర్‌ సీఎం రోడ్డులో ఉంటున్న వివాహిత రబియా బుస్రా(28) ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో గొడవ జరగడంతో తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆరో ఠాణా ఎస్సై గౌరీందర్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. నగరంలోని చంద్రశేఖర్‌ కాలనీకి చెందిన రబియా బుస్రాకు ఆటోనగర్‌కు చెందిన మహ్మద్‌ హఫీజ్‌తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరు సీఎం రోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తలిద్దరి మధ్యన ఇటీవల గొడవలు మొదలయ్యాయి. శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో రబియా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్‌ సౌత్‌ రూరల్‌ సీఐ రఘునాథ్‌, ఎస్సై గౌరీందర్‌ గౌడ్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. తమ కూతురు మృతిపై అనుమానం ఉందని మృతురాలి తండ్రి కుతుబుద్దీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలని కోరారు. అన్నికోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

హమీద్‌

భార్యతో గొడవపడి ఒకరు..

నిజామాబాద్‌ నేరవార్తలు: భార్యతో గొడవపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకొంది. ఆరో ఠాణా ఎస్సై గౌరీందర్‌ గౌడ్‌ కథనం ప్రకారం..నగర శివారులోని ధర్మపురిహిల్స్‌లో నివాసం ఉండే హమీద్‌(55)కు భార్యతో వివాదం నడుస్తోంది. శుక్రవారం వీరి మధ్యన గొడవ జరిగింది. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకొన్న కుటుంబసభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here