గొడ్డలితో దాడి: యువకుడి మృతి

0
3


గొడ్డలితో దాడి: యువకుడి మృతి

బోధన్‌, న్యూస్‌టుడే: పట్టణంలోని 12వ వార్డులో బుధవారం సాయంత్రం జరిగిన ఘర్షణలో గొడ్డలితో దాడి చేయగా దాసరి నరేష్‌(32) అనే యువకుడు మృతిచెందాడు. సీఐ రాకేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నరేష్‌ తన మిత్రుడితో కలిసి రాకాసిపేట్‌లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలోనే వెంకటేష్‌ తన భార్య పోశవ్వను కొడుతుండడాన్ని గమనించాడు. వీరిద్దరూ బావమరుదులు. చెల్లి వరుసైన పోశవ్వను కొడుతున్న ఆయన్ను నిలువరించే ప్రయత్నంలో రెండు దెబ్బలు వేశాడు. ఈ విషయాన్ని పక్కనే ఉన్న వెంకటేశ్‌ సోదరులు అశోక్‌, కృష్ణయ్య గమనించి కోపంతో దాడి చేశారు. ఈ క్రమంలోనే వెంకటేశ్‌ ఇంట్లోకి వెళ్లి గొడ్డలి తెచ్చి నరేష్‌ తలపై మూడు చోట్ల నరకడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. తండ్రి దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here