గొర్రెలకు అవార్డులు.. అవి చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా?

0
1


వార్డులు కేవలం మనుషులకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఆ దేశంలో గొర్రెలకు కూడా అవార్డులు ఇస్తారు. పతకాలు, బహుమతులతో ఘనంగా సత్కరిస్తారు. ఇంతకీ ఎక్కడా అని అనుకుంటున్నారా? న్యూయార్క్‌లోని మాన్హాటన్‌లో. G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అవార్డుల పేరుతో ఐదు అత్యుత్తమ గొర్రెలను ఘనంగా సత్కరించారు.

ఎందుకలా?: మాన్హాటన్‌లోని రివర్ సైడ్ పార్కు నిర్వాహకులు.. అక్కడ తిరిగే గొర్రెలను సత్కరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వేసవిలో ఎక్కువగా పెరిగే ప్రమాదకర గడ్డిని తినే గొర్రెలను గుర్తించి వాటికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డుల కోసం మొత్తం 24 గొర్రెలు బరిలో నిలిచాయి. అయితే, వాటిలో ఐదు గొర్రెలకు మాత్రమే ఆ అవార్డులు, పతకాలు లభించాయి.

పదేళ్ల వయస్సు గల మస్సీ అనే గొర్రె 1,328 పౌండ్ల గడ్డిని తిని ప్రథమ స్థానంలో నిలిచి G.O.A.T అవార్డును సొంతం చేసుకుంది. బెల్లా, బక్లెస్, చలుపా, స్కిట్టెల్స్ అనే గొర్రెలు కూడా ఈ అవార్డులను అందుకున్నాయి. ఈ సందర్భంగా వాటికి ట్రోపీలతోపాటు అవి ఎంతో ఇష్టంగా తినే పూల బొకెలను అందించారు. 60 ఎకరాల్లో విస్తరించిన రివర్‌సైడ్ పార్క్‌లో ప్రమాదకరమైన గడ్డి మొలుస్తుంటుంది. దీన్ని తిని అరిగించుకోగలిగే శక్తి కేవలం గొర్రెలకు మాత్రమే ఉంటుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో 400 మందికి పైగా అతిథులు పాల్గోవడం విశేషం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here