గొర్రెల కాపరికి రూ.1500 జరిమానా

0
4


గొర్రెల కాపరికి రూ.1500 జరిమానా

కల్యాపూర్‌లో యజమానికి జరిమానా రశీదును అందిస్తున్న కార్యదర్శి

యంచ(నవీపేట), న్యూస్‌టుడే: గొర్రెల కాపరి గిర్మన్నకు రూ. 1500 జరిమానా విధించినట్లు కార్యదర్శి ఇఫ్తేఖరుద్దీన్‌ శనివారం చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హరితహారంలో భాగంగా మండలంలోని యంచ నీటి పథకం వద్ద మొక్కలు నాటామన్నారు. నందిగామ గొర్రెల కాపరి గిర్మన్నకు చెందిన జీవాలు నాటిన మొక్కలను మేయడంతో సదరు వ్యక్తికి జరిమానా విధించామన్నారు.

పాడి గేదెల యజమానులకు...

కల్యాపూర్‌(రెంజల్‌): కల్యాపూర్‌లో రోడ్డుపై కట్టేసిన పాడి గేదెల యజమానులకు శనివారం పంచాయతీ కార్యదర్శి రోజ జరిమానా విధించారు. గ్రామంలో సీసీ రోడ్లపై పాడి గేదెలను కట్టేసే వారికి జరిమానా విధించాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. శనివారం సర్పంచి కాశం నిరంజని, ఉపసర్పంచి జలయ్య, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కాశం సాయిలు, కారదర్శి రోజా, పాలకవర్గ సభ్యులు గ్రామంలోని కాలనీలను పరిశీలించారు. రోడ్డుపై పాడిగేదెలను కట్టేసిన కాశం వెంకట్‌, మైనిరాజు, గంగాధర్‌కు రూ. 500ల చొప్పున జరిమానా విధించారు.

ఎడపల్లిలో..

ఎడపల్లి: ఎడపల్లి శివారులో శనివారం ఉదయం నాటిన మొక్కలను 20 మేకలు మేశాయి. సమాచారం తెలుసుకున్న గ్రామ పంచాయతీ సిబ్బంది మేకలను కార్యాలయంలో నిర్బంధించారు. యాజమానికి రూ.వెయ్యి జరిమానా విధించారు. జరిమానా రశీదును సర్పంచి మాధవి, మండల పంచాయతీ అధికారి సిరాజుద్దీన్‌, కార్యదర్శి నాగేశ్‌ యజమానికి అందించారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here