గోదారి పరవళ్లు

0
4


గోదారి పరవళ్లు

పరివాహక గ్రామాలు అప్రమత్తం

మహారాష్ట్ర అధికారుల హెచ్చరిక

జిల్లా యంత్రాంగానికి లేఖలు

బోధన్‌, న్యూస్‌టుడే

గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో మహారాష్ట్ర సర్కారు గురువారం సాయంత్రం అప్రమత్తత ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కలెక్టర్‌ ఎంఆర్‌ఎంరావు, పోలీసు కమిషనర్‌ కార్తికేయకు పంపారు. ఎగువన కురుస్తున్న ఏకధాటి వర్షాల వల్ల గోదావరిలో నీటిమట్టం అమాంతం పెరుగుతోందని… పరివాహక గ్రామాల ప్రజలను నదికి చేరువలో వెళ్లనీయొద్దని సూచించారు. అక్కడి నీటిపారుదల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

బాబ్లీ – ఎస్సారెస్పీ మధ్య నది విస్తీర్ణం సుమారు 80 కిలోమీటర్లు ఉంది. రెంజల్‌ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి జిల్లా భూభాగంలోకి ప్రవేశిస్తుంది. తాడ్‌బిలోలి, కోస్లీ, యంచ, బాసర మీదుగా ప్రవహిస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఏటా జులై 1 నుంచి అక్టోబరు 28 వరకు బాబ్లీ గేట్లను పూర్తిగా ఎత్తేయాలి. అంటే ఎగువ గోదావరిలోకి వచ్చే ప్రతి నీటి బిందువు కింద ఎస్సారెస్పీ వరకు వెళ్లాలి. బాబ్లీకి అనుసంధానంగా గొలుసుకట్టు చెరువుల మాదిరి చిన్నాచితక ప్రాజెక్టులు సుమారు 18 వరకు ఉన్నాయి. వర్షాకాలంలో ఆ జలాశయాలు పూర్తిగా నిండాకే ఎస్పారెస్పీకి ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుత వర్షాలు బాబ్లీ సహా అనుసంధాన ప్రాజెక్టులను జలకళతో నింపాయి. వరద ఇంకా వస్తోంది. జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని అంచనా వేసి గేట్లు తెరుస్తారు. బాబ్లీకి గొలుసుకట్టుగా ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తాల్సిన పరిస్థితిని అధికారులు అంచనా వేసి గోదావరి పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అదే జరిగితే గోదావరిలో భారీగా నీటి ప్రవాహం ఉంటుంది. గురువారం ఉదయం ఎస్సారెస్పీలో 63,110 క్యూసెక్కులు ఉన్న ప్రవాహం సాయంత్రానికి 36,795 ఉంది. మహారాష్ట్ర యంత్రాంగం సూచన మేరకు జిల్లా అధికారులు ముందస్తు చర్యలు తీసుకొన్నారు. నది సమీపంలో ఉన్న కుటుంబాలకు హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు నది చేరువలో వెళ్లొద్దని సూచించారు. తిరిగి తాము ప్రకటన చేసే దాకా జాగ్రత్తగా ఉండాలని డివిజన్‌లోని రెవెన్యూ అధికారులు డప్పు చాటింపు వేయించారు.


ఎస్సారెస్పీకి భారీగా వరద

60 టీఎంసీలు దాటిన నిల్వ

ఇన్‌ఫ్లో 63,110 క్యూసెక్కులు

మెండోరా, న్యూస్‌టుడే: ఎస్సారెస్పీలో నీటి నిల్వ 60 టీఎంసీలు దాటింది. గురువారం ఉదయం 52,591 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మధ్యాహ్నానికి 63,110 క్యూసెక్కులకు చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 1082.90 అడుగులు ఉంది. ప్రస్తుతం 60.631 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాలైన నిర్మల్‌ జిల్లా, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో భారీ వరద వచ్చి చేరుతోంది. ఒక్క రోజులోనే 3 టీఎంసీలు రావడం గమనార్హం. శుక్రవారం ప్రాజెక్టు నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఎస్సారెస్పీ అధికారులు పేర్కొంటున్నారు. ఆవిరి రూపంలో 550 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 142 క్యూసెక్కులు వెళ్తోందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, అక్కడి నుంచి దిగువకు నీటిని వదులుతున్నారని, వరదంతా గోదావరిలోకి వస్తోందని నాందేడ్‌ కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఎస్సారెస్పీ డీఈ జగదీష్‌ తెలిపారు. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీఈ పేర్కొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here