గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసిన లోకేష్ ..జే ట్యాక్స్ కోసం వణికిస్తున్నారని ట్వీట్

0
0


గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసిన లోకేష్ ..జే ట్యాక్స్ కోసం వణికిస్తున్నారని ట్వీట్

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసిపి పాలనపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఏర్పాటు చేసిన కియా కార్ల కంపెనీ ఏపీ లో తయారైన మొట్టమొదటి కారును లాంచ్ చేసిన సందర్భంగా అభినందనలు తెలిపిన నారా లోకేష్ తాజాగా గోరంట్ల మాధవ్ ను కియా కార్ల కంపెనీ విషయంలో టార్గెట్ చేశారు.

కియా కార్ ప్రారంభోత్సవ వేడుకలో గోరంట్ల మాధవ్ బెదిరింపులపై ట్వీట్ చేసిన లోకేష్

కియా సంస్థ వారి మెడలు వంచుతామని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు, తనను వేదికపైకి ఆహ్వానించలేదని కియా ప్రతినిధికి చేసిన బెదిరింపులపై ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇంతకాలం విజయ్ సాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలను టార్గెట్ చేసిన లోకేష్ ఇక తాజాగా అదే పార్టీకి చెందిన సంచలన నేత గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసారు. నిన్నటికి నిన్న కియా కారు ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కియా ఒక దార్శనికుడి స్వప్నానికి ఫలితమన్న నారా లోకేష్. కియా మోటార్స్‌ సంస్థని ఏపీలో నెలకొల్పడానికి చంద్రబాబు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదని కొనియాడారు . కియా సంస్థ నుండి మొట్టమొదటి మేడిన్‌ ఆంధ్రా కారు విడుదలవుతున్న సందర్భంగా కియా యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షాలు అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

కియా మెడలు వంచుతామని కియా ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ మాధవ్

కియా కారు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కియా ప్రతినిధిని బెదిరించటంపై లోకేష్ పోస్ట్ చేశారు.ఇంతకాలం విజయ్ సాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలను టార్గెట్ చేసిన లోకేష్ ఇక తాజాగా అదే పార్టీకి చెందిన సంచలన నేత గోరంట్ల మాధవ్ ను టార్గెట్ చేసారు. కియా కార్ రోల్ అవుట్.. అవర్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యూత్ ఈజ్ రూల్ద్ అవుట్ అని కారు పై రాసి సంతకం చేశారు గోరంట్ల మాధవ్ . అంటే కియా కారు బయటకు వచ్చింది కానీ మన శక్తివంతమైన యువతకు మాత్రం మొండిచెయ్యే మిగిలింది అని గోరంట్ల మాధవ్ కియా కార్ల కంపెనీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గోరంట్ల మాధవ్ చేసిన హంగామా పై నారా లోకేష్ స్పందించారు. కియా మెడలు వంచి స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.

‘J-టాక్స్' కోసమెలా వణికిస్తున్నారో అర్ధం అయ్యిందన్న లోకేష్ .. మాధవ్ ఎలా స్పందిస్తారో

‘J-టాక్స్’ కోసమెలా వణికిస్తున్నారో అర్ధం అయ్యిందన్న లోకేష్ .. మాధవ్ ఎలా స్పందిస్తారో

గతంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై మీసం మెలేసి తొడగొట్టిన నాటి పోలీస్ అధికారిగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గురించి అందరికీ తెలుసు. జెసి దివాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్ ల మధ్య ఏస్థాయిలో మాటల యుద్ధం జరిగిందో అందరికి తెలిసిందే. ఇక అలాంటి మాధవ్ పై నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. కియా వారి మెడలు వంచుతాం అన్నట్టుగా మాధవ్ చెప్పిన స్టేట్మెంట్ తో ఉన్న ఒక పేపర్ క్లిప్పింగ్ ను జత చేసి “కియాలాంటి అంతర్జాతీయసంస్థనే ఈరేంజ్ లో బెదిరిస్తున్నారంటే, స్థానిక పెట్టుబడిదారులను మీ ‘J-టాక్స్’ కోసమెలా వణికిస్తున్నారో అర్థమవుతోంది. మీకు వీలైతే నాలుగు కంపెనీలను రాష్ట్రానికి తీసుకురండి. అంతేకానీ మా కష్టంతో తెచ్చిన కంపెనీలను మీ పులివెందులపంచాయతీతో బెదిరించి తరిమేయకండి” అంటూ మరో సంచలన ట్వీట్ చేశారు లోకేష్. ఇక లోకేష్ చేసిన ట్వీట్ పై అసలే దుడుకు స్వభావం ఉన్న గోరంట్ల మాధవ్ ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here