గోవధ చేస్తే చర్యలు

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని గోవధ చేస్తే కఠిన చర్యలు తప్పవని నందిపేట ఎస్‌ఐ రాఘవేంద్ర పేర్కొన్నారు. నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్లో ముస్లిం పెద్దలు, కసబ్‌లతో (కటిక వారితో) గురువారం సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. గతంలో జరిగిన దురదష్ట సంఘటనలు దష్ట్యా ఇబ్బందులు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో ముస్లింలు బక్రీద్‌ పండుగ పర్వదినాన్ని సుఖసంతోషాలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల ప్రజలు యువకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఎవరైనా గోవధ చేస్తున్నట్లు సమాచారం ఉంటే చట్టాన్ని గౌరవించి పోలీసులకు సమాచారం అందించాలి తప్పితే నేరుగా గోవులు తెస్తున్న వారి వద్దకు వెళ్లి గొడవలు సష్టించ వద్దని కోరారు. కటిక వారు కూడా గోవధ చేయడం లేదని ఎస్‌ఐకి భరోసా ఇచ్చారు. కార్యక్రములో జమే మజీద్‌ అధ్యక్షుడు జమిల్‌, జమాత్‌ అధ్యక్షుడు గౌస్‌, మైనారిటీ కమిటీ అధ్యక్షుడు మాజరుద్దీన్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here