గోవాలో న్యూడ్ పార్టీ.. పోలీసులు హైరానా, సీఎం పైనా ఒత్తిడి

0
2


గోవా టూర్ అంటే చాలు.. కుర్రకారులో తెలియని పరవశం కనిపిస్తుంది. ఓ వైపు బీచ్ అందాలు, మరోవైపు విదేశీ భామలతో కళకల్లాడే సాగర తీరంలో ఉత్సాహంతో ఉరకలేస్తారు. అలాంటిది అక్కడ ‘న్యూడ్ పార్టీ’ అంటే వదిలిపెడతారా?? రెక్కలు కట్టుకుని వాలిపోరూ!!

Read also: మిస్సయిన కూతురు ‘పోర్న్’ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం.. ఫొటోలు చూసి షాకైన తల్లి

ఇటీవల ఉత్తర గోవా, సోషల్ మీడియాలో న్యూడ్ పార్టీ పోస్టర్లు వెలిశాయి. ఈ పార్టీలో 10 నుంచి 15 మంది విదేశీ అమ్మాయిలు, మరో 10 మంది భారతీయ యువతులు పాల్గొంటారని పోస్టర్లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నిర్వాహకులను వెతికే పనిలో పడ్డారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ‘‘రాష్ట్రంలో న్యూడ్ పార్టీలు నిర్వహించేందుకు అనుమతి లేదు. అలాంటివి ఎక్కడ జరిగినా అడ్డుకుంటాం’’ అని తెలిపారు.

Read also: పార్కులో గ్యాంగ్ రేప్.. ‘ఫేస్‌బుక్‌’తో అన్నదమ్ముల అఘాయిత్యాలు

దీనిపై గోవా ముఖ్యమంత్రి, పర్యాటక మంత్రులపైనా పైనా ఒత్తిడి పెరిగుతోంది. గోవాలో అశ్లీల ఘటనలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గోవా మహిళా కాంగ్రెస్ అధినేత ప్రతిమ కౌటింహో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పార్టీలో గోవాలో జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనిపై ముఖ్యమంత్రి ప్రమోద్ స్వాంత్, పర్యాటక మంత్రి మనోహర్ అజ్గోంకార్ స్పందించాలి’’ అని తెలిపారు. బీచ్‌ల్లో నగ్నంగా తిరిగే స్వేచ్ఛ కేవలం ఫ్రాన్స్ తదితర పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఉంది. మరి, త్వరలో జరగబోయే ఆ ‘న్యూడ్ పార్టీ’.. నిజంగా జరుగుతుందా? లేదా పోలీసులను ఆటపట్టించేందుకు ఆ ప్రకటన చేశారా అనేది తెలియాల్సి ఉంది.

PIC: Representative ImageSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here