గోవింద నామస్మరణతో మార్మోగిన చుక్కాపూర్‌

0
2


గోవింద నామస్మరణతో మార్మోగిన చుక్కాపూర్‌


లక్ష్మీనరసింహుడి వలవిరాట్టు

చుక్కాపూర్‌, లక్ష్మీరావులపల్లి (మాచారెడ్డి), న్యూస్‌టుడే: మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ అటవీ ప్రాంతంలోని లక్ష్మీనరసింహుడి ఆలయం ఆదివారం గోవింద నామస్మరణతో మారుమోగింది. సెలవు రోజు కావడంతో ఆలయానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. భక్తులు తమ గండాలు బాపాలంటూ స్వామి వారికి గండ దీపాలు తీశారు. లక్ష్మీ సమేతుడైన నరసింహుడికి పట్టెనామాలు, కోరమీసాలు, ముక్కు, కళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంతానం లేని మహిళలు అల్లుబండ పట్టి పరీక్షించుకున్నారు. నూతన దంపతులు అమ్మవారికి ఒడిబియ్యాలు పోసి ముడుపులు కట్టారు. ఆలయ ఆవరణలోని ఆదిశేషుడు, ఆంజనేయస్వామి ఆలయాల్లో సైతం భక్తులు పూజలు నిర్వహించారు.

దర్శనానికి బారులు తీరిన భక్తులు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here