గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నాగరాజ్‌గౌడ్‌

0
6


గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నాగరాజ్‌గౌడ్‌

నాగరాజ్‌గౌడ్‌ను సన్మానిస్తున్న రాష్ట్ర కార్యవర్గం ప్రతినిధులు 

కామారెడ్డి గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కామారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజ్‌గౌడ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజ్‌గౌడ్‌ నియామక పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జిల్లాలో గౌడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నాగరాజ్‌గౌడ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం సమన్వయసమితి అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్‌, జిల్లా అధ్యక్షుడు బాలార్జున్‌గౌడ్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యదర్శిగా బాలాగౌడ్‌

కామారెడ్డి అర్బన్‌:: తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర క్యార్యదర్శిగా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన బక్కొల్ల బాలాగౌడ్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో బాలాగౌడ్‌కు నియామక పత్రాన్ని అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బాలాగౌడ్‌ను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా అధ్యక్షుడు బాలార్జున్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here