‘గ్యాంగ్ లీడర్’ రిలీజవుతున్నందుకు చాలా బాధగా ఉంది: నాని

0
5


నేచురల్ స్టార్ నాని హీరోగా, RX 100 ఫేమ్ కార్తికేయ నెగిటివ్ రోల్‌లో వస్తోన్న సినిమా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. లక్ష్మి, శరణ్య, అనీష్ కురివిళ్ల, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, ప్రాణ్య, సత్య ముఖ్య పాత్రలు పోషించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి యలమంచిలి, మోహన్ చెరుకూరి నిర్మించారు.

ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందకు వస్తోన్న ‘నానీస్ గ్యాంగ్ లీడర్’పై భారీ అంచనాలున్నాయి. సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు ఇప్పటికే తిరుపతి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో చిత్ర యూనిట్ పర్యటించి సినిమాకు మంచి ప్రచారం చేసింది. మంగళవారం రాత్రి వైజాగ్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

ఇక మరో రెండు రోజుల్లో సినిమా వస్తుందనగా బుధవారం హైదరాబాద్‌లో చివరి ప్రెస్ మీట్‌ను నాని తన గ్యాంగ్‌తో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో నాని, కార్తికేయ, ప్రియాంక, విక్రమ్ కె.కుమార్, నిర్మాతలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా పట్ల తాను చాలా ఎక్సయిట్‌మెంట్‌తో ఉన్నానని చెప్పారు.

తన ప్రతి సినిమా విడుదల ముందు వచ్చే రెండు రోజులను తాను చాలా బాగా ఎంజాయ్ చేస్తానని, ఆ ఎక్సయిట్‌మెంట్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆ టెన్షన్‌లో ఒక కిక్ ఉంటుందని, అందుకే తనకు ఇష్టమని అన్నారు. నిజం చెప్పాలంటే ‘గ్యాంగ్ లీడర్’ రిలీజైపోతుందనే బాధకూడా వచ్చేస్తుందన్నారు. ఈ రెండు రోజులు తాను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తానని, 13వ తేదీ నుంచి మీరు ఎంజాయ్ చేయండి అంటూ ప్రేక్షకులకు సూచించారు.

చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం విడుదల చేసిన ‘గ్యాంగ్ లీడర్’ మేకింగ్ వీడియోలో దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఒకచోట కంటతడి పెట్టారు. దీంతో సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఒక రేంజ్‌లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, సినిమా అంత ఎమోషనల్‌గా ఉండదని నాని స్పష్టం చేశారు.

‘జెర్సీ’ స్థాయిలో ఈ సినిమాలో అంత ఏడిపించే మ్యాటర్ ఏమీ లేదని నాని చెప్పారు. విక్రమ్ మామూలుగానే బాగా ఎమోషనల్ అని, చిన్న ఎమోషనల్ సీన్ ఉన్నా సరే ఏడ్చేస్తారని నాని వెల్లడించారు. సినిమాలో ఎక్కువ కామెడీనే ఉంటుందని నాని హామీ ఇచ్చారు. అక్కడక్కడ కొన్ని హార్ట్ టచ్చింగ్ సీన్లు ఉంటాయన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here