గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ

0
10



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేగాం గ్రామపంచాయతీలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మంజూరైన గ్యాస్‌ సిలిండర్లు ఆదివారం పంపిణీ చేశారు. అందులో భాగంగా హెచ్‌.పీ గ్యాస్‌ ఆర్మూర్‌ నరేందర్‌ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఆర్మూర్‌ మండలంలోనే అత్యధికంగా దేగాం గ్రామంలో సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మాజీ సర్పంచ్‌ బియ్యంక్‌ గణేష్‌ సహకారంతో ఆర్మూర్‌ మండలంలోనే అత్యధిక దరఖాస్తులు స్వీకరించి తమకు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆదివారం కొన్ని సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. ఇందుకోసం కషి చేసినందుకు బియ్యంక్‌ గణేష్‌ మాజీ సర్పంచ్‌ను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ గడ్డం గంగారెడ్డి, అనూష, శ్రీనివాస్‌ గౌడ్‌ ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here