గ్యాస్‌ సిలిండర్‌ లీకై ప్రమాదం

0
0


గ్యాస్‌ సిలిండర్‌ లీకై ప్రమాదం

బోధన్‌, న్యూస్‌టుడే: వివాహ వేడుకలకు సిద్ధమవుతున్న బోధన్‌ పట్టణంలోని ఓ ఇంట్లో సోమవారం వంట గ్యాస్‌ సిలిండర్‌ లీకై ప్రమాదం సంభవించింది. ఘటనలో పెళ్లి కూతురుగా ముస్తాబవుతున్న యువతికి స్వల్ప గాయాలయ్యాయి. సిలిండర్‌ పక్కన దీపం ఉండడం వల్ల ప్రమాదం సంభవించింది. మంగళవారం వివాహ వేడుక జరగనుండగా చోటుచేసుకొన్న ప్రమాదం కుటుంబీకులను భయాందోళనకు గురిచేసింది. వంట గదిలోని సామగ్రి కొంత మేరకు కాలిపోయింది. స్వల్ప వ్యవధిలో మంటలు ఆరిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here