గ్యాస్ కొరత : ముందే జాగ్రత్త పడండి …

0
2


గ్యాస్ కొరత : ముందే జాగ్రత్త పడండి …

వంట గ్యాస్ ఒక్కరోజు లేక పోతే ఇంటిల్లి పాది పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక పండగల సీజన్లో అయితే గ్యాస్ లేకపోతే అంతే సంగతి. గ్యాస్ అయిపోవడానికి ముందే జాగ్రత్తగా చాలా మంది బుక్ చేసి పెట్టుకుంటారు. పండగ సీజన్ లో అయితే మరింత అప్రమత్తంగా ఉంటారు. అయితే ఇప్పుడు వంట గ్యాస్ (ఎల్పీజీ ) కొరత ఏర్పడుతోందన్న వార్తలు వినియోగదారులకు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాలు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. దసరా దగ్గర పడుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరత అన్న వార్త ఆందోళన కలిగించే అంశమే. అయితే ముందు జాగ్రత్తగా ఒక గ్యాస్ సిలిండర్ ఎక్కువ ఉంచుకుంటే ఎలాంటి సమస్య ఉండదు కదా…

కొరత ఎందుకు?

* నవీ ముంబై లోని ఉరాన్ వద్ద ఉన్న ఓఎంజీసీ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల సప్లై లో కొన్ని అవాంతరాలు ఎదురైతున్నట్టు సమాచారం. దీనికి తోడు ఈ నెలలోనే సౌదీ ఆరాంకో క్షేత్రాల పై డ్రోన్ దాడి వల్ల కూడా కొంత ఇబ్బంది తలెత్తినట్టు చెబుతున్నారు.

* మనదేశానికి ముడి చమురు, వంట గ్యాస్ సరఫరా చేస్తున్న రెండో అతిపెద్ద దేశం సౌదీ అరేబియా.

* ప్రస్తుతం మనకు ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్, హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ గ్యాస్ కంపెనీలు వంట గ్యాస్ ను సరఫరా చేస్తున్నాయి. వీటి కస్టమర్ల సంఖ్య దాదాపు 27 కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది.

* తాత్కాలికంగా గ్యాస్ కొరత నేపథ్యంలో కంపెనీలు కస్టమర్లకు ఇబ్బందిలేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రెండు సిలిండర్లు ఉన్న వారికన్నా ముందు ఒక్క సిలిండర్ ఉన్న వారికి గ్యాస్ అందించాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఎక్కువగా కొరత లేదని చమురు కంపెనీలు

ఎక్కువగా కొరత లేదని చమురు కంపెనీలు

* అయితే ఇప్పటికైతే మరీ ఎక్కువగా కొరత లేదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఎల్ పీ జీ కోసం ప్రత్యామ్నాయాలు చేసుకున్నామని, వారంలోనే ఎల్పీజీ అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఎల్పీజీని సప్లై చేస్తున్న మంగుళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ వర్షం కారణంగా గత నెలలో కొన్ని యూనిట్లను మూసివేసింది. కొన్ని ప్రైవేట్ రిఫైనర్లు కూడా మెయింటెనెన్సు నిమిత్తం మూసివేయడం కూడా సప్లై పరంగా కొంత కొరతను కరణమైనట్టు తెలుస్తోంది. అయితే ఎల్ పీ జీ కి పండగ సీజన్లో ఎలాంటి కొరత లేకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొత్త కార్గో త్వరలోనే భారత తీరాలకు చేరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పెరుగుతున్న డిమాండ్

పెరుగుతున్న డిమాండ్

* దేశంలో వంట గ్యాస్ కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం ప్రారంభించినప్పటి నుంచి వినియోగం ఇంకా పెరిగిపోయింది.

* 2016 సంవత్సరంలో ఎల్ పీజీ వ్యాప్తి 62 శాతం ఉండగా ఇప్పుడు 95 శాతానికి చేరుకుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here