గ్రంథాలయం ప్రారంభం

0
3



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశాయిపేట్‌ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర యువనాయకులు దేశాయిపేట్‌ పిఏసిఎస్‌ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివద్ధి చేసుకుందామని బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టిందని, ప్రతీ గ్రామంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో యువకుల, విద్యార్థుల, పోటీ పరీక్షల నిమిత్తం గ్రంధాలయాన్ని ప్రారంభించారు. గ్రామంలో యువకులకు ఎటువంటి సహాయ సహకారాలకైనా ముందుంటామని పేర్కొన్నారు. దివ్యాంగులకు, వికలాంగులకు ప్రయాణాల నిమిత్తం ఉచిత బస్‌ పాసులను లబ్దిదారులకు అందచేశారు. వికలాంగులకు ప్రభుత్వం 3,016 రూపాయల పెన్షన్‌ అందిస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, సర్పంచ్‌ శ్రావణ్‌, ఎంపీటీసీ రమణ, నాయకులు భునేకర్‌ ప్రకాష్‌, గురు వినయ్‌, పాత బాలక్రిష్ణ, నరసింహ రెడ్డి, ప్రశాంత్‌ కుమార్‌, సాయగౌడ్‌, నరహరి, రాధాకష్ణ, యూనిస్‌, వార్డు సభ్యులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here