గ్రామాలు పరిశుభ్రంగా కనిపించాలి

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోనూ, దర్పల్లి మండలం కేంద్రంలోను, ఇందల్వాయి మండలం తిర్మన్‌ పల్లి గ్రామంలోనూ పర్యటించి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వీధులలో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య తదితర కార్యక్రమాలను పర్యవేక్షించారు. దుబ్బాక గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పర్యటించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. కొత్త మెనూ ప్రదర్శించక పోవడంపై ప్రధానోపాధ్యాయురాలిని ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని మెనూతో అందించాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి వారికి బోధిస్తున్న పాఠాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండలస్థాయి, గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో ముందే నిర్దేశించుకున్న ప్రకారం పనులు ఏ రోజుకారోజు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఆయా పనులకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, అంతకంటే ముందు రోజుల్లోనే చేసుకోవాలని ఆదేశించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here