గ్రీన్‌ చాలెంజ్‌కు ఎమ్మెల్యే పిలుపు

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌కు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి మరొకరికి గ్రీన్‌ చాలెంజ్‌ విసిరి వారితో ఒక మొక్కను నాటించాలన్నారు. ఇప్పటి నుండి తన వద్దకు వచ్చె అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పూల బొకేలు, శాలువాలతో కాకుండా వాటి స్థానంలో ఒక మొక్కను తనకు బహుకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి మొక్కతో సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, యూట్యూబ్‌లలో ఇతరులకు హరితహారం గ్రీన్‌ చాలెంజ్‌ విసరాలని అన్నారు. అలాగే నాటిన మొక్కలను బాధ్యతగా తమ యొక్క కుటుంబ సభ్యునితో సమానంగా నీరు పోసి కంచెతో సంరక్షించాలని చెప్పారు. మొక్కల పెంపకంతోనే కాలుష్య నివారణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యదర్శులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. హరితహారంలో భాగస్వాములు కావాలని, హరితోద్యమంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అందరూ భాగస్వామ్యమై గ్రీన్‌ చాలెంజ్‌ను అందరూ స్వీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అందరం భాగస్వాములమై విజయవంతం చేద్దామన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here