గ్లామర్‌ షో వర్క్‌ అవుట్ అయ్యింది.. బిగ్‌ చాన్స్‌ కొట్టేసిన రకుల్‌!

0
3


సౌత్‌లో సూపర్‌ హిట్ అయిన చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్‌ మీద ఆశలతో అవకాశాలు పొగొట్టుకున్నారు. సౌత్‌లో మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్‌ మీద ఆశపడ్డ చాలామంది భామలు కనుమరుగయ్యారు. ఇటీవల కాలంలో ఒక్క తాప్సీ తప్ప సౌత్‌ను మరో భామ బాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు. అయితే తాజాగా బాలీవుడ్ ఆశలతో ఎదురుచూస్తున్న రకుల్ మరో క్రేజీ ఆఫర్‌ను పట్టేసింది.

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ చెక్కేసింది రకుల్‌. అయితే సౌత్‌ సినిమాను మాత్రం వదిలిపెట్టలేదు. తెలుగు సినిమాలు చేస్తూనే హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రకుల్‌ సక్సెస్‌ అయ్యింది మాత్రం తెలుగు సినిమాతోనే. తరువాత తమిళ సినిమాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
Also Read: నందమూరి అభిమానులకు నిరాశ.. వారసుడి ఎంట్రీపై బాలయ్య క్లారిటీ

టాలీవుడ్‌లో టాప్‌ హీరోలందరి సరసన నటించిన రకుల్‌, గత ఏడాది విడుదలైన అయ్యారే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ సినిమాలో రకుల్ నటనకు మంచి మార్కులు పడటంతో అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. అందం, అభినయంతో పాటు గ్లామర్‌ షోలోనూ బాలీవుడ్ బ్యూటీస్‌కు పోటి ఇవ్వటం రకుల్‌కు ప్లస్‌ అయ్యింది. సోషల్ మీడియాలోనూ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వేడి పెంచుతోంది ఈ బ్యూటీ.
Also Read: తమిళ `అర్జున్‌ రెడ్డి`కి తీరని కష్టాలు.. రిలీజ్‌ మరోసారి వాయిదా!

అజయ్‌ దేవగన్‌ హీరోగా తెరకెక్కిన దే దే ప్యార్‌ దేలో రకుల్‌ చేసి బోల్డ్ క్యారెక్టర్‌ అమ్మడి బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది. తాజాగా ఈ భామ నటించిన బాలీవుడ్ మూవీ మర్జావన్‌ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ భామ మరో బాలీవుడ్ మూవీకి సైన్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బాలీవుడ్‌ రకుల్‌ ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాల్లోనే నటించింది. తొలిసారిగా సోలో హీరోయిన్‌గా ఈ సినిమాలో నటించనుందట.

మహిళా దర్శకురాలు కశ్వీ నాయర్‌ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్‌ ఆజ్‌ కల్‌ తరహా లవ్ స్టోరిగా తెరకెక్కనుందట. ఈ సినిమాలో యంగ్ హీరో అర్జున్‌ కపూర్‌తో జత కట్టేందుకు రెడీ అవుతోంది రకుల్‌. గ్లామర్‌ షోత అవకాశాలు సాధించిన రకుల్‌ ఈ సినిమాతో స్టార్‌ ఇమేజ్‌ అందుకుంటుందేమో చూడాలి. త్వరలో ఈ భామ తెలుగులో నితిన్‌, చంద్ర శేఖర్‌ ఏలేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది.
Also Read: కోట్లు కొల్లగొడుతున్న `ఖైదీ`.. కార్తీ కెరీర్‌ బెస్ట్‌

అర్జున్‌ కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here