ఘనంగా ఆదివాసి దినోత్సవం

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారత విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలలో శుక్రవారం ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. వనవాసి సెల్‌ జిల్లా కన్వీనర్‌ నరేష్‌ నాయక్‌ మాట్లాడుతూ దేశంలో ఆదివాసీ గిరిజనులు విద్య వైద్య, జీవన స్థితిగతులు అనేక విషయాలపై ఏబీవీపీ ప్రత్యేక దష్టి సారించడం జరుగుతుందన్నారు. దేశంలో ఆదివాసి విషయాలపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నేడు ఏబీవీపీ ఆదివాసి దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. విద్యారంగ సమస్యలే కాకుండా దేశం కోసం జాతీయ పునర్నిర్మాణం దిశగా ఏబీవీపీ పయనిస్తూ నంబర్‌ వన్‌ ఆర్గనైజేషన్‌గా ఈరోజు పనిచేస్తుందని, కాబట్టి విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, ఉపాధ్యాయులను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి తులసీదాస్‌, సజన్‌ గౌడ్‌, నాగ సాయి తేజ, కేజీబీవీ ప్రిన్సిపాల్‌, విద్యార్థులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here