ఘనంగా ఏఐఎస్‌ఎఫ్‌ ఆవిర్భావ వేడుకలు

0
6నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లాలోని ఏఐఎస్‌ఎఫ్‌ కార్యాలయం ముందు 84 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ 1936 ఆగస్ట్‌ 12న బెనారస్‌ యూనివర్సిటీలో ఏఐఎస్‌ఎఫ్‌ కేవలం ఏడుమంది సభ్యులతో ఆవిర్భవించి నేడు దేశ వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్న చరిత్ర ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘము అన్నారు. దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘము ఏఐఎస్‌ఎఫ్‌ అని వారు అన్నారు. అలాగే జిల్లా కో కన్వీనర్‌ నరేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఏఐఎస్‌ఎఫ్‌ దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘము అని ఆనాటి నుండి ఈనాటి వరకు కామన్‌ స్కూల్‌ విద్యా విధానం కోసం పోరాటం చేస్తున్నదని, ప్రవేట్‌ కార్పొరేట్‌ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి పోరాడుతున్న విద్యార్థి సంఘము ఏఐఎస్‌ఎఫ్‌ అని వారు అన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.బాలరాజు, నాయకులు సాయికిరణ్‌, నర్సింలు, శివ ప్రసాద్‌, నగేష్‌, ప్రేమసింగ్‌, సంతోష్‌, గోపాల్‌, రాం సింగ్‌, నరేందర్‌, తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here