ఘనంగా బతుకమ్మ సంబరాలు

0
2



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని గీత కాన్వెంట్‌ స్కూల్‌ లో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విధ్యార్దులు రకరకాల పూలను తీసుకువచ్చి బతుకమ్మను అందంగా పేర్చారు. పాఠశాల ఆవరణలో బతుకమ్మలను ఒక్కదగ్గరికి చేర్చి బతుకమ్మ పాటలు పాడారు. కార్యక్రమంలో కరస్పాండెంట్‌ గంగ సాగర్‌, ప్రిన్సిపాల్‌ గంగ భూషణ్‌, టీచర్లు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here