ఘనంగా రక్షాబంధన్‌

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్షాబంధన్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. 15 ఆగష్టున రాఖీ పండగ కావడంతో ఆయా సంస్థలు రాఖీలు ధరించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి ఏబివిపి ఆధ్వర్యంలో మంగళవారం రక్షాబంధన్‌ కార్యక్రమం నిర్వహించారు. పలు కళాశాలల్లో విద్యార్థులు ఒకరినొకరు రాఖీలు కట్టుకొని నేను నీకు రక్షా, నీవు నాకు రక్షా, మనం ఈ దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రక్షాధారణ చేశారు. అలాగే బ్రహ్మకుమారీలు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here