చండీమాల్, మాథ్యూస్‌కు పిలుపు: కివీస్‌తో తొలి టెస్టుకు లంక జట్టు ప్రకటన

0
4


హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఇప్పటికే యాషెస్ సిరిస్‌తో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవగా… శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆగస్టు 14న ప్రారంభమయ్యే తొలి టెస్టుతో ఇరు జట్ల మధ్య టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలవనుంది.

20 ఏళ్ల తర్వాత కూడా కోహ్లీ-రోహిత్‌ విబేధాలపై స్టోరీలు ఆగవు

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌‌ల సిరిస్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరిస్ కోసం కేన్ విలియమ్సన్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు శ్రీలంకకు చేరుకుంది. మరోవైపు శ్రీలంక జట్టు సైతం ఈ టెస్టు సిరిస్ కోసం 15 మందితో కూడిన జట్టుని ప్రకటించింది.

శ్రీలంక మాజీ కెప్టెన్ దినేశ్ చండీమాల్ ఆరు నెలలు తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో దినేశ్ చండీమాల్ 5, 0, 15, 4 పరుగులతో పేలవ ప్రదర్శన చేయడంతో టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత వరల్డ్‌కప్‌లో సైతం చోటు దక్కించుకోలేకపోయాడు.

India vs West Indies: లారా రికార్డు బద్దలు, చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్

ఇక, మోకాలి గాయంతో దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్‌కు దూరమైన ఏంజెలో మాథ్యూస్ సైతం న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏంజెలో మాథ్యూస్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కూడా చేశాడు.

ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను 3-0తో క్లీవ్ స్వీప్ చేసిన శ్రీలంక మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ వన్డే సిరిస్‌లో ఏంజెలో మాథ్యూస్ మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. శ్రీలంక టెస్టు జట్టుకు దిముత్ కరుణరత్నే కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు 15 మందితో కూడిన శ్రీలంక జట్టు:

దిముత్ కరుణరత్నే (సి), ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, లాహిరు తిరిమన్నే, కుసల్ మెండిస్, కుసల్ జనిత్ పెరెరా, నిరోషన్ డిక్వెల్లా, ధనంజయ డి సిల్వా, అకిలా దనంజయ, లసిత్ ఎంబూల్దేనియా, సురంగ లకన్, ఒసాన్ లక్మల్,Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here