చంద్రయాన్‌ గురించి తెలుసుకోవాలనుందా..!

0
1


చంద్రయాన్‌ గురించి తెలుసుకోవాలనుందా..!

విద్యార్థులూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు

వరంగల్‌(దేవరుప్పుల), న్యూస్‌టుడే

సుమారు రెండున్నర నెలలుగా ఆబాలగోపాలాన్ని ఆసక్తికరంగా మార్చిన చంద్రయాన్‌కు సంబంధించిన చర్చలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. తమకు తెలిసిన సమాచారాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తున్నారు. చంద్రయాన్‌ గురించి మీకు తెలిసింది చెప్పడానికి, మరికొంత సమాచారం తెలుసుకోవాలనుకునే వారికి ఇస్రో చక్కని అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, అటామిక్‌ మినరల్‌ డైరెక్టరేట్‌, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌తో కలిసి వచ్చే నెలలో 14 నుంచి 17 వరకు నాలుగు రోజులపాటు పలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రదర్శన సమయంగా నిర్ణయించారు. కేవలం విద్యార్థులే కాకుండా ఎవరైనా ఈ వేడుకల్లో పాల్గొనవచ్ఛు రెండు రోజుల క్రితమే ప్రకటన వెలువడింది. మరిన్ని వివరాలకు ఆయా జిల్లాల సైన్స్‌ అధికారులను సంప్రదించాలి.

ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదువుతున్న విద్యార్థులను విభాగాలుగా గుర్తించి వారికి వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనంతోపాటు క్విజ్‌ పోటీలను నిర్వహించనుంది. నామమాత్రపు రుసుముతో ఈ పోటీలో పాల్గొనే అవకాశాన్ని విక్రమ్‌ సారాభాయ్‌ సెంటినరీ ప్రోగ్రాం పేరిట నిర్వహించనుంది.

వ్యాసరచన పోటీ వ్యవధి: గంట

మాధ్యమం: హిందీ, ఆంగ్లం

పోటీ తేదీ: అక్టోబరు 14న ఉదయం 10.30 గంటలకు

చిత్రలేఖనం: ఆరు నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులు. ప్రతి పాఠశాల నుంచి ముగ్గురికి మించని ప్రాతినిధ్యం ఉండవచ్ఛు

అంశం: విక్రం సారాభాయ్‌- అంతరిక్షం, విక్రం సారాభాయ్‌- అణుశక్తి

పోటీ తేదీ: అక్టోబరు 15న ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు

వక్తృత్వం: ప్రతి పాఠశాల నుంచి ఇద్దరికి మించకుండా ప్రాతినిధ్యం ఉండవచ్ఛు అంతరిక్షం, అటామిక్‌ శక్తికి సంబంధించి ఏదైనా ఒక అంశం గురించి నిర్వాహకులు అప్పటికప్పుడే అంశం ఇస్తారు. రెండు నిమిషాల వ్యవధిలో హిందీ, ఆంగ్ల భాషల్లో ధారాళంగా నిర్వాహకులు ఇచ్చిన అంశంపై మాట్లాడాలి.

పోటీ తేదీ: అక్టోబరు 15న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు

రూపక ప్రదర్శన: తరగతితో సంబంధం లేకుండా ఐదు నిమిషాల వ్యవధిలో హిందీ, ఆంగ్ల భాషల్లో ఐదుగురు సభ్యులకు మించకుండా ప్రదర్శన ఇవ్వొచ్ఛు

అంశం: ‘డాక్టర్‌ విక్రం సారాభాయ్‌ ఉనికి- ఆయన సేవలు’

పోటీ తేదీ: అక్టోబరు 17న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.

వేదిక: నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ అవుట్‌ రీచ్‌ ఫెసిలిటీ, జీడిమెట్ల సబ్‌ స్టేషన్‌ దగ్గర, జేఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ పక్కన జీడిమెట్ల.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here