చంద్రయాన్ 2 పంపిన అసలు పిక్స్ వచ్చేసాయ్!! 5000 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూగోళం

0
6


చంద్రయాన్ 2 పంపిన అసలు పిక్స్ వచ్చేసాయ్!! 5000 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూగోళం

బెంగళూరు: మనదేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-2 చందమామకు చేరువగా వెళ్తోంది. వచ్చేనెల 7వ తేదీన చంద్రయాన్-2 ఉపగ్రహం చంద్రుని మీద దిగబోతోంది. ఈ నేపథ్యంలో.. ఈ ఉపగ్రహం భూమికి సంబంధించిన కొన్ని ఫొటోలను తీసింది. వాటిని ఇస్రోకు పంపించింది. ఇస్రో ఛైర్మన్ కె శివన్ ఆదివారం వాటిని విడుదల చేశారు. ప్రస్తుతం భూ కక్ష్యలో ప్రయాణిస్తోంది చంద్రయాన్‌-2.

దీనికి అమర్చిన ఎల్‌- 14 కెమెరా సహాయంతో భూమికి సంబంధించిన కొన్ని స్టన్నింగ్ పిక్స్ లను తీసింది. చంద్రయాన్ అంతరిక్షంలో ప్రయోగించిన తరువాత తీసిన తొలి ఫొటోలు ఇవే. ఇంతకుముందు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ.. అవి నకిలీవని తేలిపోయింది. భూ ఉపరితలానికి అయిదువేల కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రయన్ 2 ఈ ఫొటోలను తీసింది. శనివారం సాయంత్రం 5:28 నుంచి 5:37 నిమిషాల మధ్య భూమిని క్లిక్ మనిపించింది. అమెరికా ఉపఖండం, పసిఫిక్ మహాసముద్రం ఈ పిక్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫొటోల్లో ఎలాంటి లోపాలు లేవని, దీన్ని బట్టి చంద్రయాన్ అద్భుతంగా పనిచేస్తోందనే విషయాన్ని నిర్ధారించవచ్చని కె శివన్ తెలిపారు.

1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నెల 22 తేదీన నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ప్రస్తుతం చంద్రయాన్ 2 నాలుగో దశలో కొనసాగుతోంది. భూస్థిర కక్షలో పరిభ్రమిస్తోంది. క్రమంగా దీన్ని చంద్రుని స్థిర కక్షలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. చివరిదశ వచ్చే నెల 7న పూర్తవుతుంది. విక్రమ్ ల్యాండర్ ను అదేరోజు చంద్రునిపై దిగేలా చర్యలు తీసుకుంటారు. దీన్ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here