చంద్ర‌బాబుకు వంత పాడుతున్న‌ బీజేపీ: వైఎస్ జ‌గ‌న్‌కు వార్నింగ్‌!

0
2


చంద్ర‌బాబుకు వంత పాడుతున్న‌ బీజేపీ: వైఎస్ జ‌గ‌న్‌కు వార్నింగ్‌!

అమ‌రావతి: భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర శాఖ నాయ‌కులు కొన్ని కీల‌క విష‌యాల్లో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడికి వంత పాడుతున్నారు. ఇప్ప‌టికే- చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చోటు చేసుకున్న విధాన‌ప‌ర‌మైన, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై నోరు మెద‌ప‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ట్లేదు. రాజ్య‌స‌భ స‌భ్యులు సీఎం ర‌మేష్‌, సుజ‌నా చౌద‌రి, రామ్మోహ‌న్ రావు వంటి నాయ‌కులు బీజేపీలో చేర‌డమే దీనికి కార‌ణ‌మ‌ని చెప్ప‌డం ఒక ఎత్త‌యితే- ప్ర‌స్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా, ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీగా ఎదగ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌టం ఇంకో ఎత్తు.

ఈ నేప‌థ్యంలో- చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను పునఃసమీక్షించాలంటూ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని బీజేపీ రాష్ట్ర‌శాఖ నాయ‌కులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను పునఃసమీక్షించ‌కూడ‌దంటూ ఇదివ‌ర‌కే కేంద్ర ఇంధ‌న వ‌న‌రుల మంత్రిత్వ‌శాఖ కార్య‌ద‌ర్శి రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. అయిన‌ప్ప‌టికీ- ఈ ఒప్పందాల వ్య‌వ‌హారంలో కోట్ల రూపాయ‌ల మేర ముడుపులు చేతులు మారిన‌ట్లు భావిస్తోన్న వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌.. పునఃస‌మీక్ష నిర్ణ‌యం నుంచి వెన‌క్కి త‌గ్గ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

  ఎమ్మెల్సీ రేసులో రవిచంద్రారెడ్డి
  BJP MLC Madhav gave ultimatum to Chief Minister of AP YS Jagan

  విద్యుత్ కొనుగోలు ఒప్పందాల జోలికి వెళ్లొద్దంటూ బీజేపీ శాస‌న మండ‌లి స‌భ్యుడు మాధ‌వ్ డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేంద్రం చేసిన సూచ‌న‌ల‌ను పాటించి తీరాల‌ని మాధ‌వ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి డిమాండ్ చేశారు. దీనిపై ఇదివ‌ర‌కుక‌ కేంద్రం చేసిన సూచ‌న‌ల‌ను గౌరవించాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రిపై ఉంద‌ని చెప్పారు. ఒక‌సారి ఒప్పందాలు కుదిరిన త‌రువాత వాటిని పునఃస‌మీక్షించ‌డం స‌రికాద‌ని మాధ‌వ్ హిత‌వు ప‌లికారు. ముఖ్య‌మంత్రి అనాలోచితంగా ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని, దీనివ‌ల్ల పెట్టుబడులు రావ‌ని చెప్పారు. పారిశ్రామిక‌వేత్త‌ల్లో ఆందోళ‌న‌కు, గంద‌ర‌గోళానికి ఇది దారి తీస్తుంద‌ని అన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల‌న్నీ పొరుగు రాష్ట్రాల‌కు త‌ర‌లి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని మాధ‌వ్ చెప్పారు.  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here