చదువుకోవాలంటే… గొడుగులు పట్టుకోవాల్సిందే

0
2


చదువుకోవాలంటే… గొడుగులు పట్టుకోవాల్సిందే

మద్నూర్‌, న్యూస్‌టుడే: విద్యాభివృద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు నిదర్శనం ఈ చిత్రమే. మద్నూర్‌ జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 344 మంది బాలికలు చదువుకుంటున్నారు. పాఠశాలలో అయిదు గదులు మాత్రమే ఉన్నాయి. అందులో రెండు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలకు చెందినవి. గదులన్నీ వర్షానికి ఉరుస్తుండటంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. చేసేదేమీలేక ఇలా తరగతి గదిలోనే గొడుగులు పట్టుకుని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొందని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు బయట వరండాలో చదువుకుంటున్నారు. పాఠశాలకు రావాలంటేనే కష్టంగా ఉందని అధికారులు స్పందించాలని విద్యార్థినులు కోరుతున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here