చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

0
0


చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల స్థితిగతులను అప్‌లోడ్‌ చేయడానికి పాఠశాల విద్యాశాఖ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. 2372 పాఠశాలలకు సంబంధించి వివరాలను సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటి వరకు 1800 పాఠశాలల వివరాలు విద్యాశాఖకు అందాయి. పూర్తి స్థాయిలో సమాచారం అందితే ఇంకెన్ని బడులకు తాగునీటి సౌకర్యం అవసరమో లెక్క తేలనుంది. మంచినీటి సదుపాయం లేని బడులకు ప్రధానోపాధ్యాయులు.. కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసేలా జిల్లా విద్యాశాఖ అధికారులను దిశా నిర్దేశం చేశారు.

పచ్చలనడ్కుడలో…

పచ్చలనడ్కుడ(వేల్పూర్‌) : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని డీఈవో జనార్దన్‌రావు సూచించారు. వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడలో శనివారం మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… క్రీడలతో శారీరక దృఢత్వం, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఎంపీపీ భీమా జమున, జడ్పీటీసీ సభ్యురాలు అల్లకొండ భారతి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు సురేష్‌, సర్పంచి ఏనుగు శ్వేత, ఎంపీటీసీ సభ్యులు గంగాధర్‌, గంగారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఏడ్ల రాజేశ్వర్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రాములు, ఉపసర్పంచి గంగారెడ్డి, క్రీడల నిర్వహణ కన్వీనర్‌ సురేష్‌, గంగారెడ్డి, గ్రామకమిటీ సభ్యులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here